Monday, 2 November 2026

రైతు రుణమాఫీపైప్రభుత్వాన్నినిలదీసిన‌ ప్రతిపక్షాలు ..

ss7p8qusహైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీలో రైతు సమస్యలపై వాడివేడి చర్చ సాగింది. అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగింది. రుణమాఫీపై ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇవ్వలేదని నిరసిస్తూ.. ప్రతిపక్ష సభ్యులు సభలోనే రాత్రివరకూ బైఠాయించారు. సభ వాయిదా పడ్డా.. సభ్యలు అసెంబ్లీలోనే ఉండడంతో మార్షల్స్‌ వారిని బలవంగా ఎమ్మెల్యే క్వార్టర్స్‌కు తరలించారు. రైతు రుణమాఫీపై స్పష్టత ఇచ్చేంత వరకూ ప్రభుత్వంపై తమ పోరు సాగుతుందంటున్నారు విపక్ష సభ్యులు.రైతు రుణమాఫీ, ఆత్మహత్యలు, కరువు మండలాలు వంటి అంశాలపై బుధవారం అసెంబ్లీలో ప్రభుత్వాన్ని విపక్ష సభ్యలు నిలదీశారు. మాఫీ సొమ్మును ఒకేసారి కట్టి.. రైతు సమస్యలను తీర్చాలని డిమాండ్‌ చేశారు. రెండురోజులపాటు చర్చ జరిగినా రైతులకు ప్రభుత్వం నుంచి ఎలాంటి భరోసా రాలేదని, రుణమాఫీ మొత్తాన్ని ఒకేసారి చెల్లించాలన్న తమ డిమాండ్‌పై స్పష్టత ఇవ్వలేదంటూ శాసనసభ వాయిదాపడిన తర్వాత కూడా విపక్ష పార్టీల ఎమ్మెల్యేలందరూ సభలోనే బైఠాయించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మరోవైపు మంత్రి హరీశ్‌రావు ఛాంబర్‌లో కొందరు మంత్రులు సమావేశమై పరిస్థితిని సమీక్షించారు. చివరకు మార్షల్స్ రంగప్రవేశం చేసి వారిని బయటకు తీసుకొచ్చారు. అనంతరం పోలీసులు వారిని ప్రత్యేక వాహనాల్లో ఎమ్మెల్యే క్వార్టర్స్ కు తరలించారు.వ్యవసాయం, రైతు సంక్షేమంపై మంగళవారం ఉదయం ప్రారంభమైన చర్చ బుధవారం రాత్రి 9గంటల వరకు జరిగింది. ముగింపు దశలో అధికార, విపక్ష సభ్యులు పరస్పర ఆరోపణలకు దిగడంతో పలు అంశాలపై తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. అంతకుముందు రైతు ఆత్మహత్యలపై సీఎం కేసీఆర్‌ సభలో సుదీర్ఘ సమాధానమిచ్చారు. రెండు గంటలపాటు ఆయన ప్రసంగం కొనసాగింది. వివిధ మార్గాల ద్వారా నిధులన్నీ సమకూరితే రుణమాఫీ అమలకు తొలి ప్రాధాన్యమిస్తాన్నారు కేసీఆర్‌. రైతులు ఎవరూ ఆత్మహత్యలు చేసుకోవద్దని విజ్ఞప్తి చేశారు. వ్యవసాయం సంక్షోభం నుంచి బయటపడాలంటే దీర్ఘకాలిక చర్యలు అవసరమన్నారు. రైతును తప్పకుండా ఆదుకోవాల్సిందేనని, ఈ విషయంలో భేషజాలకు పోబోమన్నారు. రైతు ఆత్మహత్యలపై.. సమస్య మూలాల్లోకి వెళ్లాలి అంటూ హైకోర్టు చేసిన వ్యాఖ్యలను స్వాగతిస్తున్నామన్నారు. తన ప్రసంగం మధ్యలో అడ్డు తగిలిన టీడీపీ సభ్యులపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు సంబంధించి చేపట్టిన చర్చ 13గంటలకు పైగా సాగింది. గురువారం ఇదే అంశంపై సభలో పట్టుబడతామని విపక్షాలు తెలిపాయి. మొత్తంగా సభలో అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య వాద ప్రతివాదాలు జరిగాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *