అమలు తీరుపై సర్వత్రా హర్షామోదాలు
కెసిఆర్ పథకాలపై నేతల ఆసక్తి: నిరంజన్ రెడ్డి
హైదరాబాద్,జూన్1(జనంసాక్షి): ఎనిమిదేళ్ల తెలంగాణ చరిత్రలో అనేక రైతు సంక్షేమ కార్యక్రమాలు
అమలు చేసి రైతాంగాన్ని ఉన్నతస్థితికి తీసుకున్ని వెల్లిన ఘనత సిఎం కెసిఆర్‌కే దక్కుతుందని వ్యవసాయశాఖ మంత్రి నరింజన్ రెడ్డి అన్నారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆయన ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. దేశంలో ఎక్కడాలేని విధంగా ఉచిత నితరంతర విద్యుత్, మిషన్ కాకతీయతో చెరువుల పునరుద్దరణ, రైతుబంధుతో పెట్టుబడి పథకం, ఎరువుల విత్తనాలు అందించడం వంటివన్నీ రైతులకు అండగా నిలిచేలా తీసుకున్న నిర్ణయాలని అన్నారు. ఇప్పుడు తెలంగాణలో కరెంట్ కోసమో..ఎరువుల కోసమో.. క్యూలు కట్టే దుస్థితి లేకుండా చేసిన ఘనత కూడా కెసిఆర్‌దేనని అన్నారు. ఒక్కో పథకాన్ని పట్టాలకెక్కించి ముందుకు సాగుతున్న తీరు విపక్షాలను సైతం ఆశ్చర్యానికి గురి చేయడమే గాకుండా దేశంలోని వివిధ ప్రాంతాల నేతలను అకట్టుకునేలా చేస్తోందన్నారు. స్వయంగా రైతు అయిన కేసీఆర్..ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నాటినుంచి వ్యవసాయరంగంలో ఇబ్బందులను ఒక్కొక్కటిగా పరిష్కరించడంపై దృష్టి పెట్టారు. రైతు అవసరాలు ఎరిగి.. ప్రణాళికాబద్ధంగా వ్యవసాయ రంగాన్ని ముందుకు తీసుకెళుతున్నారని అన్నారు. అవస్థలపాలు చేసిన కరంటు కష్టాలు మూడేండ్లలో పూర్తిగా మటుమాయమయ్యాయి. సాగుకు ఏమాత్రం ఇబ్బందులు లేకుండా సాఫీగా సాగేలా ఒక్కటొక్కటిగా సాగునీటి ప్రాజెక్టులు అందుబాటులోకి వస్తున్నాయి. ఓవైపు పెట్టుబడికి చేయూత, మరోవైపు గిట్టుబాటు ధర వచ్చేలా దేశ వ్యవసాయరంగానికే తెలంగాణను ఆదర్శంగా నిలిపేందుకు ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారని అన్నారు. ఏండ్ల తరబడి బీళ్లయిన భూములను ఆకుపచ్చగా మార్చడంలో కేసీఆర్ అనుసరించిన వ్యూహాలు, అన్నదాతలకు అండగా నిలుస్తున్న తీరు దేశంలోని అనేకులకు ఇప్పటికీ ఆశ్చర్యం గొలుపుతున్నాయనడంలో సందేహం లేదన్నారు. రైతుల్లో ఆనందో త్సాహాలు వ్యక్తమవుతున్నాయి. ఎకరానికి రూ.5వేల పెట్టుబడి అందచేయడంతో సీఎం కేసీఆర్ దేశ వ్యవసాయరంగంలోనే సరికొత్త అధ్యాయానికి తెరతీశారు. సాగునీరు.. సకాలంలో సబ్సిడీపై ఎరువులు, విత్తనాల సరఫరా, పండిన పంటను దాచుకునేందుకు సరిపడా గోదాంల నిర్మాణం.. పంటలు ఎండకుండా పచ్చని పైర్లు కండ్ల చూసేలా 24 గంటల ఉచిత కరంటు సరఫరా.. ఇలా రైతన్నకు అనేక విధాలుగా అండగా ఉంటూ వస్తున్నారు. స్వరాష్టాన్న్రి సాధించుకున్న తర్వాత తెలంగాణ సర్కార్ వ్యవసాయరంగం కోసం తీసుకున్న చర్యలకు సర్వత్రా హర్షామోదాలు లభిస్తున్నాయి. సాగులో రైతులకు సలహాలు, సూచనలు అందించేలా క్షేత్రస్థాయిలో వ్యవసాయ, ఉద్యాన శాఖలను బలోపేతం చేసేలా ప్రభుత్వం భారీగా నియామకాలు చేపట్టిందన్నారు. క్రాప్ కాలనీలను గుర్తించి రాష్టాన్న్రి పండ్లు, పూలు, కూరగాయల సాగులో స్వయంసమృద్ధి సాధించేలా ప్రణాళికలు రూపొందించినట్లు వెల్లడిరచారు. పామాయిల్ సాగుకు ప్రోత్సాహం ఇస్తున్నామని అన్నారు.
రైతు సంక్షేమం లక్ష్యంగా కార్యక్రమాలు




