శ్రీకాకుళం జిల్లా పాతపట్నం రైల్వే స్టేషనులో గున్‌పూర్- పలాస ప్యాసింజర్ రైలు దిగుతూ కిందపడిన నారాయణరావు అనే వృద్ధుడు తీవ్రంగా గాయపడ్డారు. తీవ్రంగా గాయపడిన వృద్ధుడిని పాతపట్నం ప్రాథమిక ఆరోగ్యకేంద్రానికి తరలించి చికిత్స చేస్తున్నారు. వృద్ధుడి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెప్పారు.




