– టికెట్ కండక్టరే కారణమని చితకబాదిన ప్రయాణికులు
హైదరాబాద్, సెప్టెంబర్15(జనంసాక్షి) : వికారాబాద్ జిల్లాలో దారుణ ఘటన జరిగింది. గొల్లగూడెం రైల్వే స్టేషన్ సవిూపంలో తాండూరు – నాంపల్లి ప్యాసింజర్ రైలు నుంచి పడి యువకుడు మృతిచెందిన ఘటన చోటుచేసుకుంది. రైల్వే అధికారుల వివరాల ప్రకారం.. అనంతగిరి తండాకు చెందిన యువకుడు శివ ఎంబీఏ పూర్తి చేశాడు. ఉద్యోగ నిమిత్తం లింగంపల్లిలో పెయింటింగ్ పని చేస్తున్నాడు. శనివారం ఉదయం వికరాబాద్ స్టేషన్ నుండి లింగంపల్లికి వెళ్తున్నాడు. యువకుడు టికెట్ లేకుండా రైలులో ప్రయాణిస్తున్నాడని, దీంతో టీటీ గుర్తించిన యువకుడిని పట్టుకునేందుకు యత్నించాడు. దీంతో టీటీ నుంచి తప్పించుకునే ప్రయత్నంలో ఆ యువకుడు రైలు నుంచి కింద పడిపోయి అక్కడికక్కడే మృతి చెందాడు. దీనికి కారణం టికెట్ కండెక్టరే అంటూ రైల్వే ప్రయాణికులు ఆయన చితకబాది పోలీసులకు అప్పగించారు. ఇదిలా ఉంటే రైలులో ఉన్న పలువురి ప్రయాణికుల వాదన మరోలా ఉంది. ఉదయం వికరాబాద్ స్టేషన్ నుండి లింగంపల్లికి వెళ్తున్న శివ, గొల్లగూడ రైల్వే స్టేషన్ లో యవకుడు కిందికి దిగాడని, రైలు కదలడంతో శివ మళ్లీ ట్రైన్ ఎక్కుతుండగా.. టికెట్ లేదని అనుమానంతో శివకు టికెట్ కండెక్టర్‌వెనక్కి తోసేసాడని తెలిపారు. దీంతో యువకుడు ట్రైన్ కిందపడి అక్కడికక్కడే మృతి చెందాడని, అతని తల, మొండెం వేరు అయ్యాయని పలువురు ప్రయాణికులు పేర్కొంటున్నారు. ఇదిలా ఉంటే రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలా ఉండగా శివ ఆదివారం వీఆర్వో పరీక్ష రాయాల్సి ఉంది. చేతికొచ్చిన కుమారుడు అర్ధాంతరంగా చనిపోవడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు.
రైలు నుండి కిందపడి.. యువకుడు మృతి




