హోసురు: బెంగళూరు-ఎర్నాకుళం ఇంటర్ సిటీ ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది మృతి చెందగా, 50 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను 10 అంబులెన్సుల్లో స్థానిక ఆసుపత్రికి తరలిస్తున్నారు. బోగీలో మరో 20 మంది చిక్కుకున్నారు. ప్రమాద స్థలంలో సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. ఘటనాస్థలానికి చేరుకున్న కేంద్ర మంత్రి సదానంద గౌడ పరిస్థితిని అధికారులను అడిగి తెలుసుకుంటున్నారు.





