తొలగించాలని ఆదేశించిన మంత్రి హరీష్ రావు
హైదరాబాద్,జూలై24(జనంసాక్షి): రైల్వే లైన్ విూదుగా పోతున్న విద్యుత్ లైన్లను తొలగించి ప్రత్యామ్నాయ మార్గాల్లో ఏర్పాటు చేయాలని మంత్రి హరీష్ రావు అధికారులకు సూచించారు. గజ్వేల్-మనోహరాబాద్ రైల్వేలైన్, స్టేషన్లు తదితర అంశాలపై అధికారులతో ఉదయం 8 గంటలకు హైదరాబాద్‌లోని తన నివాసంలో మంత్రి హరీశ్‌రావు ప్రత్యేక సవిూక్ష నిర్వహించారు. పనుల పురోగతిపై పూర్తి సమాచారం సేకరించిన మంత్రి.. గజ్వేల్-మనోహరాబాద్ రైల్వేలైన్ విూదుగా క్రాస్‌ఓవర్ అవుతున్న ఐదు విద్యుత్ టవర్ల విషయంలో ట్రాన్స్‌కో ఉన్నతాధికారులతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. రెండు నెలల్లోనే ఈ టవర్ల మార్పు, ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై చర్చించనున్నట్లు అధికారులు వివరించారు. అప్పాయిపల్లి గ్రామంలో ఇండ్లు కోల్పొతున్న వారికి రెండు పడకల ఇండ్లు కట్టించి ఇస్తామని హామినిచ్చారు. రైల్వేలైన్ భూసేకరణ విషయంలో మెదక్ కలెక్టర్ ధర్మారెడ్డి, సిద్దిపేట కలెక్టర్ వెంకట్రామ్‌రెడ్డి, జిల్లాలోని ఆర్డీవోలు చేసిన కృషిని అభినందించారు. సమావేశంలో దుబ్బాక ఎమ్మెల్యే రామలింగారెడ్డి, రైల్వేచీఫ్ ఇంజనీర్ రమేష్, డిప్యూటీ చీఫ్ ఇంజనీర్ సుబ్రమణ్యం, రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్‌చైర్మన్ భూంరెడ్డి, ఫుడ్స్ చైర్మన్ ఎలక్షన్‌రెడ్డిలతో పాటు మాదాసుశ్రీనివాస్, దేవి రవీందర్, కొట్టాల యాదగిరి, రమేష్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.




