సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో విషాదకర సంఘటన జరిగింది. సికింద్రాబాద్ నుంచి మహారాష్ట్రకు వెళ్తున్న ఇంటర్ సిటీ ఎక్స్ ప్రెస్ రైలులో నుంచి పడిన చిన్నారికి తీవ్రగాయాలయ్యాయి. సీతాఫల్ మండి స్టేషన్ కు రాగానే మహిళ చేతిలో నుంచి చిన్నారి జారి పట్టాలపై పడింది. దీంతో తోటిప్రయాణికులు చైన్ లాగి ట్రైన్‌ను ఆపారు. చిన్నారిని గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఘటనలో చిన్నారి రెండు కాళ్లు కోల్పోయింది. రెండు చేతులకు తీవ్రగాయాలు కావడంతో పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
రైళ్లో నుంచి కిందపడిన బాలిక




