రోడ్డు కల్వర్టు పనులను పరిశీలించిన కార్పొరేటర్
అల్వాల్ (జనంసాక్షి) జూన్ 8
తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి పట్టణం పచ్చదనంతో ఉండాలనే సీఎం కేసీఆర్ పట్టణ ప్రగతి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అల్వాల్ సర్కిల్ వెంకటాపురం డివిజన్ చిట్టెమ్మ నగర్ కాలనీలోని స్థానిక కార్పొరేటర్ సబిత అనిల్ కిషోర్ బుధవారం పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా చిట్టమ్మ నగర్ నుంచి టెలికం కాలనీ కి వెళ్లే రోడ్డు కల్వర్టు 15 లక్షలతో నిర్మిస్తున్న పనులను పరిశీలించడం తో పాటు వర్షాకాలం రావడంతో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలని నిర్మాణం పనులు పూర్తి చేయాలని రోడ్డు పనులకు నాణ్యత ప్రమాణాలు పాటించాలని కార్పొరేటర్ అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు ఏఈ అరుణ్, వర్క్ ఇన్స్పెక్టర్ వెంకట్రావు, పీవో రజిని, స్థానిక టిఆర్ఎస్ పార్టీ డివిజన్ ప్రధాన కార్యదర్శి అనంతుల సంతోష్, సయ్యద్ మోసిన్, సాయి కుమార్, జమందర్, షేక్, పెంటన్న, షబ్బీర్, ఉదయ, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.