నగరంలో టిప్పర్ బైక్ ఢీ
హైదరాబాద్,జనవరి3(జనంసాక్షి): రాష్ట్రంలో రెండు వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో నలుగురు వ్యక్తులు మృతిచెందారు. హైదరాబాద్ నగరంలోని లంగర్‌హౌస్ పరిధిలో పీవీ ఎక్స్‌ప్రెస్‌వేపై గురువారం ఉదయం జరిగిన ప్రమాదంలో ఇద్దరు బ్యాంకు ఉద్యోగులు మృతి చెందారు. పిల్లర్ నంబర్ 102 వద్ద ఈ ప్రమాదం జరిగింది. ద్విచక్ర వాహనాన్ని టిప్పర్ ఢీకొట్టడంతో ద్విచక్ర వాహనంపై వెళుతున్న ఇద్దరూ అక్కడికక్కడే మృతిచెందారు. మృతులను నానక్‌రామ్‌గూడ ఐసీఐసీఐ బ్యాంక్‌లో పనిచేసే దీపికా నిఖిల్, సయీద్ అహ్మద్ (32)గా గుర్తించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. అదేవిధంగా మరొక ఘటనలో వరంగల్ అర్బన్ జిల్లా ఎల్కతుర్తి మండలం సూరారం వద్ద అర్ధరాత్రి రెండు లారీలు అదుపుతప్పి ఒకదానినొకటి ఢీకొన్నాయి. ఈ దుర్ఘటనలో డ్రైవర్, క్లీనర్ ఇద్దరూ మృతిచెందారు.
రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి




