రోహిత్ ఆత్మహత్యకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ ఎంపీ వి.హనుమంతరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. హైదరాబాద్ లో ట్యాంక్ బండ్ సమీపంలోని భారతరత్న బీ ఆర్ అంబేద్కర్ విగ్రహం దగ్గర ఆయన మౌన దీక్ష చేపట్టారు. రోహిత్ కుటుంబానికి న్యాయం చేయాలని… అలాగే HCU లో సస్పెండ్ అయిన విద్యార్థులకు న్యాయం చేయాలని వీహెచ్ డిమాండ్ చేశారు. మరోవైపు విద్యార్ధులు HCU లో ర్యాలీ నిర్వహించారు. దీంతో పాటు యూనివర్సిటీలోని అన్ని విభాగాలను విద్యార్థి సంఘాలు మూసివేయిస్తున్నాయి.
రోహిత్ మృతికి బాధ్యులను కఠినంగా శిక్షించాలి





