హైదరాబాద్ : లంగర్ హౌస్ పీఎస్ పరిధిలోని మందుల బస్తీలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఆసిఫ్ నగర్ ఏసీపీ ఆధ్వర్యంలో ఈ తనిఖీలను నిర్వహించినట్లు సమాచారం. కార్డన్ సెర్చ్ లో భాగంగా 31 మంది అనుమానితులను అదుపులోకి తీసుకొన్న పోలీసులు, 13 బైక్ లు, రెండు ఆటోలను సీజ్ చేశారు. మరో వైపు కొంత మంది పాత నేరస్తులు, మరి కొంత మంది కొత్త నేరస్తులని పట్టుకున్నారు
లంగర్ హౌస్ లో కార్డన్ సెర్చ్..




