లక్కిరెడ్డిపల్లిలో మెగా లోక్‌ అదాలత్‌

కడప,జూలై14(జ‌నం సాక్షి): లక్కిరెడ్డిప్లలె కోర్డు అవరణలో మండల న్యాయ సేవా సమితి ఆధ్వర్యంలో శనివారం మెగా లోక్‌ అదాలత్‌ నిర్వహించారు. లక్కిరెడ్డిప్లలె జూనియర్‌ సివిల్‌ జడ్జి రాజశేఖర్‌ మాట్లాడుతూ… సత్వర న్యాయం అందించడానికే లోక్‌ అదాలత్‌ నిర్వహిస్తున్నామని, లోక్‌ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు. దీర్ఘ కాలంగా న్యాయం కోసం కోర్టుల చుట్టు తిరగకుండా, తమ కేసులు పరిష్కారాల కోసం లోక్‌ అదాలత్‌ ఏర్పాటు చేశామన్నారు. రాజీ మార్గం,పరస్పర అంగీకారంతో సత్వర న్యాయం లోక్‌ అదాలత్‌ ద్వారా అందుతుందన్నారు. లోక్‌ అదాలత్‌లో రాజీ చేసుకున్న సివిల్‌ కేసుల్లో ఇంతకుముందు చెల్లించిన కోర్టు ఫీజులు కూడ తిరిగి ఇస్తామన్నారు. ఈ కార్యక్రమంలో, ఎజిపి రెడ్డిశేఖర్‌, న్యాయవాదులు రామచంద్రరెడ్డి, బాలాజీ రెడ్డి, రె/-డడెన్న, లోక్‌ అదాలత్‌ మెంబర్‌ నాగబసన్న, కక్షిదారులు ఉన్నారు.

 

తాజావార్తలు