Sunday, 8 November 2026

లక్ష ఉద్యోగాల హమీ ఏమైంది ?

 

తెలంగాణ అభివృద్దికి రూ2 వేల కోట్ల 30 లక్షల నిదులిఇచ్చాం

తెలంగాణలో ఎంఐఎం ను ఎదురించే పార్టీ బిజేపి ఒక్కటే

మతప్రాతిపాదికన రిజర్వేషన్లకు వ్యతిరేకం

నిర్మల్‌ జిల్లా ఎన్నికల ప్రచారంలో అమిత్‌షా

నిర్మల్‌ నవంబర్‌ 25(జనంసాక్షి): తెరాస ప్రభుత్వం గత ఎన్నికల సందర్బంగా ఇచ్చిన లక్ష ఉద్యోగాల హమీ ఏమైందని బిజేపి జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా ప్రశ్నించారు. అదివారం నిర్మల్‌ జిల్లా కేంద్రంలో ఎన్నికల ప్రచారంలో పాల్గోని దాదాపు 45 ని. ప్రసంగించారు. ఈసందర్బంగా అయన మాట్లడుతూ తెలంగాణ అభివృద్దికి కేంద్రం దాదాపు రూ.2వేల కోట్ల 30 లక్షల నిదులు ఇచ్చిందన్నారు. కానీ ముఖ్యమంత్రి కేసీఅర్‌ నిదులను పక్కదోవ పట్టించి అబివృద్దికి పాటుపడలేదని విమర్శించారు. నాలుగున్నరెళ్ల పాలనలో తెరాస ప్రభుత్వం అన్ని రంగాలో విఫలమైందన్నారు. తెలంగాణ ఉద్యమంలో మరణించిన అమరుల కుటుంబాలకు అదుకుంటామని హమీ ఇచ్చి వారిని పట్టించుకోలేదన్నారు.దళితులకు 3ఎకరాల వ్యవసాయ భూమి ఇస్తామని దళితులను మోసం చేశారన్నారు.దళితులను ముఖ్యమంత్రి చేస్తామని చేయ్యలేదన్నారు.దేశంలో ఉన్నతమైన పదవిపై దలితుడైన రాంనాద్‌కోవింద్‌ను ఎంపిక చేయడం జరిగిందన్నారు.పార్లమెంట్‌ సెంట్రల్‌హల్‌లో అంబేద్కర్‌ చిత్రపటం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.కేవలం బిజేపి పార్టీ మాత్రమే దళితులకు రక్షణగా నిలుస్తుందన్నారు. రాష్ట్రంలోని టిడిపి,టిఅర్‌ఎస్‌,కమ్యునిస్టు పార్టీలన్ని ఎంఐఎం పార్టీకి బయపడుతుంటాయని బిజేపి మాత్రం ఎదురిస్తుందన్నారు.ఎంఐఎంకు బయపటి సెప్టెంబర్‌ను 17న తెలంగాణ విమో,న దినోత్సవం నిర్వహించడం లేదన్నారు. తాముఅధికారంలోకి వస్తే విమోచన దినాన్ని అధికారికంగా నిర్వహిస్తామన్నారు.మతప్రాతిపాదిక రిజర్వేషన్లకు బిజేపి వ్యతిరేకమన్నారు.బిజేపితోనే దేశంలో సుస్థిర పాలన సాద్యమన్నారు.బిజేపి అభ్యర్థులను భారీ మెజారీటితో గెలిపించాలని ప్రజలను కోరారు.సభ జరిగిననంత సేపు సభాప్రాంగణమంత భారత్‌మాతకి జై అంటూ నినాదాలతో మార్మోగింది. నిర్మల్‌ జిల్లా కేంద్రానికి వచ్చిన అమిత్‌షాకు నాయకులు ఘనస్వాగతం పలికారు. కార్యక్రమంలో జిజేపి జాతీయ కార్యదర్శి మురళిదర్‌రావు,రాష్ట్ర అద్యక్షుడు డా.లక్ష్మన్‌,నిర్మల్‌ శాసనసభ అభ్యర్ధి డా.స్వర్ణరెడ్డి ,జిల్లా అద్యక్షురాలు రామదేవి,ఖానాపూర్‌అభ్యర్థి సట్ల అశోక్‌,రాష్ట్ర నాయకులుఅయ్యన్నగారి భూమయ్య,రావుల రాంనాద్‌,కొడిసెల శ్రీనివాస్‌,అంజి కూమార్‌రెడ్డి,రాజేందర్‌,రాజేశ్వర్‌ రెడ్డి,రాచకొండ సాగర్‌ ,శ్రావణ్‌ తదితరులు పాల్గోన్నారు.-ముఖ్యమంత్రి కేసీఅర్‌ తన కుటుంబంపై చూపిన ప్రేమ రాష్రంపై లేదు