పాక్ వైఖరికి నిరసనగా లోక్‌సభలో తీర్మాణం
న్యూఢిల్లీ,డిసెంబర్19(జనంసాక్షి): పాకిస్థాన్‌లో ముంబయి అల్లర్ల ప్రధాన సూత్రధారి జకియుర్ రెహ్మాన్ లఖ్వీకి బెయిల్ మంజూరు చేయడాన్ని వ్యతిరేకిస్తూ భారత లోక్‌సభ శుక్రవారం తీర్మానం చేసింది. లఖ్వీకి గురువంఆరం బెయిల్ మంజూరైన తెలిసిందే. ఆయన విడుదల పై ప్రపంచవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తిన నేపథ్యంలో పాకిస్థాన్ ప్రభుత్వం మెయింటెనెన్స్ ఆఫ్ పబ్లిక్ ఆర్డర్ చట్టం కింద అతడిని మరో మూడు నెలలు నిర్బంధంలో ఉంచేందుకు ఆదేశాలు జారీ చేసింది.దీంతో జకియుర్ రెహ్మాన్ లఖ్వీ మరో మూడు నెలలు జైలులోనే గడపాల్సి వుంటుంది. బెయిలు ఉత్తర్వులు ప్రకారం లఖ్వీ శనివారం రావల్పిండి జైలునుంచి విడుదలకావలసి ఉందని, అయితే ప్రభుత్వం ఎంపీవో కింద అతడిని నిర్బంధించిందని అధికారులు తెలిపారు. పాక్ ఈ విషయాన్ని భారత ప్రభుత్వానికి కూడా సమాచారమందించింది.





