బాధ్యతలు స్వీకరించిన కొప్పుల ఈశ్వర్
హైదరాబాద్,డిసెంబర్19(జనంసాక్షి): ప్రభుత్వ చీఫ్‌విప్‌గా ధర్మపురి టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కొప్పుల ఈశ్వర్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. కొప్పులను చీఫ్ విప్‌గా నియమించగా ఇటీవల కొంత అసంతృప్తికి గురైన సంగతి తెలిసిందే. ఆ తరవాత ఆయన సిఎం కెసిఆర్ తో సమావేశమయ్యాక సంతృప్తి చెందారు. ఈ సందర్భంగా కొప్పుల విూడియాతో మాట్లాడుతూ చీఫ్‌విప్ బాధ్యతలు అప్పగించిన సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు.సీఎం ఇచ్చిన బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తానని తెలిపారు. ప్రజల పక్షాన మాట్లాడే అవకాశాన్ని కల్పించిన సీఎం కేసీఆర్‌కు మరోసారి ధన్యవాదాలు చెప్పారు. తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెడుతానని చెప్పారు. ఏడు నెలల పాలన కాలంలో సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని గుర్తు చేశారు. బంగారు తెలంగాణ కోసం సీఎం కేసీఆర్ నిర్విరామంగా కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. కేసీఆర్ తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయను అని స్పష్టం చేశారు. 14 ఏళ్లుగా ఉద్యమంలో కేసీఆర్ అడుగుజాడల్లోనే నడిచా.. ఉద్యమంలో చేసిన కృషి సీఎం గుర్తించారని తెలిపారు.తెలంగాణ ఉద్యమ ప్రస్థానంలో మడపతిప్పని నేత కొప్పుల ఈశ్వర్ అని టీఆర్‌ఎస్ ఎంపీ బాల్క సుమన్ కొనియాడారు. ప్రభుత్వ చీఫ్‌విప్‌గా కొప్పుల ఈశ్వర్ బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా బాల్క విూడియాతో మాట్లాడారు. చీఫ్‌విప్ పదవిని కొప్పులకు ఇచ్చినందుకు సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు. అట్టడుగు వర్గాలకు ప్రభుత్వంలో ప్రాతినిథ్యం కల్పించిన ఘనత కేసీఆర్‌ది అని ప్రశంసించారు. దళిత వర్గాలకు సీఎం కేసీఆర్ పెద్దపీట వేస్తున్నారని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం తక్కువ మాట్లాడి.. ఎక్కువ పని చేస్తోందన్నారు. టీఆర్‌ఎస్ బడుగు, బలహీన వర్గాల ప్రభుత్వమని చెప్పారు.





