Thursday, 5 November 2026

పారిపోయిన దొంగలు

విశాఖపట్నం, (మార్చి13): విశాఖపట్నంలోని కశింకోటలో తుపాకీలతో భయపెట్టి దొంగతనం చేయాలని వచ్చిన దోపిడీ దొంగలు పారిపోయారు. కశింకోటలోని ఓ ఇంట్లోకి దుండుగులు తుపాకీతో చొరబడ్డారు. ఇంట్లోని వారిని తుపాకీలతో బెదిరించారు. అయితే, వారు భయపడకుండా గట్టిగా కేకలు వేయడంతో దొంగలు భయపడి కాలికి బుద్ధి చెప్పి పారిపోయారు. దుండుగులపై స్థానిక పోలీస్‌ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *