Tuesday, 3 November 2026

లారీ బోల్తా .. ముగ్గురి మృతి

పూసపాటీరేగ:విజయనగరం జిల్లా పూసపాటీరేగలో జాతీయ రహదారిపై కనిమెట్ట సమీపంలో ఈ తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమదంలో ముగ్గురు మృతి చెందారు. నలుగురికి తీవ్ర గాయలయ్యాయి. లారీ అదుపుతప్పి బోల్తాపడడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందాగా మరో వ్యక్తి అసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. మృతులను విజయవాడకు చెందిన తోట ప్రసాద్‌(45), విశాఖ జిల్లా దేవవరానికి చెందిన ఈశ్వరప్ప రమణ(35), లారీ క్లీనర్‌ త్రినాధ(32)గా గుర్తించారు. క్షతగాత్రులను విజయనగరం ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *