బలమైన నాయకులు కాదు
నాగం టీడీపీలో పెద్ద నాయకుడు కావచ్చు
కాంగ్రెస్‌లో దామోదర్‌రెడ్డే బలమైన నాయకుడు
నాగం ఇంకా టికెట్ కన్ఫామ్ కాలేదు
నాగంపై ఘాటు విమర్శలు చేసిన డీకే అరుణ
హైదరాబాద్, జూన్7(జనం సాక్షి) : లావుగా ఉంటే బలమైన నాయకులు అని కాదు అంటూ నాగం జనార్దన్‌రెడ్డిపై కాంగ్రెస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి డి.కె. అరుణ ఘాటు వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్‌లో నాగం బలమైన నాయకుడు అనడం సరికాదన్నారు. గురువారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ.. నాగంపై తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేశారు. ఒకవేళ నాగం టీడీపీలో బలమైన నాయకుడు కావొచ్చేమోగానీ.. కాంగ్రెస్‌లో కాదని చెప్పుకొచ్చారు. బలమైన నాయకుడు అంటే లావుగా ఉండడం కాదని వివరించారు. కాంగ్రెస్‌లో బలమైన నాయకుడు దామోదర్‌రెడ్డే అన్నారు. నాగం బలమైన నాయకుడైతే కాంగ్రెస్‌లోకి వచ్చేవారు కాదని విమర్శించారు. నాగం బలమైన నాయకుడైతే గత ఎన్నికల్లో ఎందుకు గెలవలేదని ప్రశ్నించారు.నాగర్‌కర్నూల్‌లో కాంగ్రెస్‌కు దామోదర్‌రెడ్డి బలమైన నాయకుడు అని డీకే అరుణ చెప్పారు. అలాంటి నాయకుడితో అధిష్టానం మాట్లాడకుండా నాగం జనార్దన్‌రెడ్డిని పార్టీలోకి తీసుకోవడం సరైంది కాదన్నారు. ఇదంతా రాజకీయ కుట్రలో భాగంగానే జరిగిందని తెలిపారు. మనస్తాపంతో దామోదర్‌రెడ్డి పార్టీ మారుతున్నట్లు తెలిసింది. ఆ నిర్ణయాన్ని మార్చుకోమని చెప్పానన్నారు. నాగర్‌కర్నూల్‌లో మొదటినుంచి కాంగ్రెస్‌కు అండగా ఉన్నది దామోదర్‌రెడ్డే అన్నారు. 2004లో కేవలం 1400 ఓట్లతోనే ఆయన ఓడిపోయారని తెలిపారు. దామోదర్‌రెడ్డి బాధను రాహుల్ దృష్టికి తీసికెళ్తామని చెప్పారు. అయినా నాగం జనార్దన్‌రెడ్డికి కాంగ్రెస్‌లో ఇంకా టికెట్ కన్ఫాం కాలేదన్నారు. గద్వాలలో ముఖ్యమైన కార్యక్రమం ఉన్నందున నేడు జరిగే సీఎల్పీ సమావేశానికి వెళ్లడం లేదని స్పష్టం ఆమె చేశారు. తాను కాంగ్రెస్ గెలుపు కోసమే పనిచేస్తున్నానని.. రాహుల్‌ను ప్రధానిగా చూడాలన్న ఆశతో పని చేస్తున్నానని వెల్లడించారు. బలం చేకూర్చే నాయకులు కాంగ్రెస్‌లోకి వస్తే తప్పు లేదుగానీ.. బలమైన నాయకులు పోతే లాభం ఏంటని డీకే అరుణ ప్రశ్నించారు.
లావుగా ఉంటే..




