కొత్త తరహా దందా గుట్టును రట్టు చేసిన పోలీసులు
హైదరాబాద్,మే4(జనంసాక్షి): హైదరాబాద్‌లో కొత్త రకం గంజాయి దందా వెలుగు చూసింది. గంజాయిని లిక్విడ్ రూపంలో తీసుకువచ్చి విక్రయిస్తున్న ముఠా గుట్టు ను పోలీసులు రట్టు చేశారు. బిర్యాని ఫుడ్ కలర్స్‌లో తేనే బాటిళ్లలో లిక్విడ్ ను తీసుకువచ్చి గంజాయి లిక్విడ్‌ని విక్రయిస్తున్నట్టు గుర్తించారు. హైదరాబాద్ కేంద్రంగా నడుస్తున్న లిక్విడ్ గంజాయి ముఠాను విజిలెన్స్ అధికారులు పట్టుకున్నారు. ఈ ముఠా.. విశాఖపట్నం నుంచి లిక్విడ్ గంజాయిని తీసుకుని వచ్చి, హైదరాబాద్‌లో చిన్న చిన్న బాటిళ్లలో నింపి సరఫరా చేస్తోంది. బెంగళూరులోనూ, సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు, విద్యార్థులను టార్గెట్‌గా చేసి విక్రయాలు జరుపుతున్నట్టు తేల్చారు. ఈ కేసులో ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌తో పాటు మరో ఇద్దరిని విజిలెన్స్ అధికారులు అరెస్ట్ చేశారు.
లిక్విడ్ రూపంలో గంజాయి




