హైదరాబాద్ : కొత్త జిల్లాల ఏర్పాటుపై కేబినెట్ సబ్‌కమిటీ ఆదివారం భేటీ అయింది. ఈ సమావేశంలో మహబూబ్‌నగర్ జిల్లా ప్రజాప్రతినిధుల అభిప్రాయాలను కేబినెట్ సబ్‌కమిటీ తీసుకుంది. సమావేశంలో మాట్లాడిన కాంగ్రెస్ ఎమ్మెల్యే డీకే అరుణ తన అభ్యంతరాలను కమిటీకి దృష్టికి తీసుకెళ్లింది.. లిస్ట్‌లో గద్వాల జిల్లా పేరు ఎందుకు లేదని ఆమె ప్రశ్నించారు. గద్వాల కేంద్రంగా జోగులాంబ జిల్లా ఏర్పాటు చేయాలని ఆమె డిమాండ్ చేశారు.




