అడ్డగుట్ట : ఓ యువకుడికి శరీరం అంతా కాలిన గాయాలు…నడిచే ఓపిక లేదు. పడు కునే పరిస్థితి లేదు. నాలుగు రోజులుగా గాంధీ ఓపీ విభాగంలో పడిగాపులు. అయి నప్పటికీ అక్కడి వైద్య సిబ్బంది ఎవరికీ దయ కలగలేదు. దీంతో ఆ యువకుడిని హెల్పింగ్ ఫౌండేషన్ ప్రతి నిధులు కూ కట్‌పల్లిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తర లించారు. ఆదిలాబాద్ జిల్లాకు చెందిన నితీష్ (27)కు కొద్ది రోజుల క్రితం ఇంటి వద్ద కిరోసిన్ స్టౌపై వంట చేస్తుండగా ప్రమాదవశాత్తూ శరీరం తీవ్రంగా కాలింది. దీంతో వెంటనే కుటుంబ సభ్యులు స్థాని కవైద్యులకు చూపించారు. వారు ప్రభుత్వ ఆ స్పత్రికి రిఫర్ చేయడంతో ఆదిలాబాద్‌లోని ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ ఆరోగ్యం మెరుగుకాకపోవడంతో నాలుగు రోజుల క్రితం తల్లి తన కొడుకు నితీష్‌ను తీ సుకుని గాంధీ ఆస్పత్రికి వచ్చింది. క్యా జువాల్టీలో వైద్య సిబ్బందిని చికిత్స చే యమని కోరింది. అయితే మీరు ముందుగా ఓపీకి వెళ్లి ప్లాస్టిక్ సర్జరీ వైద్యులతో చీటి రాయించుకోవాలని అక్కడి నుంచి పంపించారు. దాంతో వారు ఓపీ విభాగానికి వెళ్లారు. అప్పటికే సమయం గడిచి పోయింది. మరుసటి రోజు ప్లాస్టిక్ సర్జరీకి ఓపీ విభాగానికి వెళ్లారు. అయితే ఆ రోజు పనిచేయడం లేదని తెలిసింది. వారంలో మంగళ, బుధవారాలు మాత్రమే ప్టాస్టిక్ ఓపీ విభాగం పనిచేస్తుందని తేలడంతో త ల్లీకొడుకులు అయోయమంలో పడ్డారు. తిరిగి ఆదిలాబాద్ పోదామను కుంటే చికిత్స అందలేదు. దీంతో మంగళవారం వరకు ఇక్కడే ఉండాలని నిశ్చ యించుకుని ఓపీలో ఉండిపోయారు. రోజు రోజుకూ నితీష్ పరిస్థితి ఆందోళనకరంగా మారింది. కాలిన గాయాలకు చికిత్స లేక పోవడంతో పరిస్థితి ఇబ్బందికరంగా ఉంది. అతడి పరిస్థితిని గమనించిన బంజారాహిల్స్‌కు చెందిన హెల్పింగ్ ఫౌండేషన్ నిర్వాహకుడు ఆస్కారీ బాధితుడ్ని కూకట్‌పల్లిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి శనివారం తరలించారు. గాంధీ ఆస్పత్రిలో పేదలకు మెరుగైన వైద్యం లభిస్తుందని ఆశతో వస్తే ఇక్కడ ప ట్టించుకునే వారు లేకుండా పోయారని ని తీష్ తల్లి ఆవేదన వ్యక్తం చేసింది.
ఓ యువకుడికి శరీరం అంతా కాలిన గాయాలు…‘గాంధీ’లో సిబ్బంది నిర్లక్ష్యం




