డబ్బులతో ఫామ్స్ లతో మాయం
నెలలు గడిచిన కానరాని కార్డ్స్
ములుగు భూపాలపల్లి జిల్లాలో శిరీషాగ్రం గా వసూలు
నెలలు గడిచిన రాని లేబర్ కార్డు లేటుగా తెలిసిన లేడీ బాస్ మోసాలు
ములుగు బ్యూరో,ఆగస్ట్02
ములుగు భూపాలపల్లి జిల్లాలను కలుపుకొని ఒకటే లేబర్ ఆఫీసు ఉండడం జరిగింది. సాధారణ ప్రజలకు ప్రభుత్వం ఇస్తున్న మంచి పథకం, కానీ కొందరు వ్యక్తులు జిల్లాలో మోసాలు చేస్తూ ప్రజలను నమ్మించుకుంటూ లేబర్ కార్డు చేస్తామంటూ పైసలు వసూలు చేస్తున్నారు. మేము లేబర్ ఆఫీస్ నుంచి వచ్చామని ఐడికార్డ్స్ వేసుకొని ఒక మహిళ విచ్చలవిడిగా గ్రామాలలో వసూళ్లకు పాల్పడింది. అంతా ఇంతా కాదు పెద్ద స్కామ్ గా మారింది. ఒక నెలలో ఒకటి నుంచి రెండు గ్రామ పంచాయతీలు టార్గెట్, మొదట గ్రామ సర్పంచికి ఫోన్ చేసి మాట్లాడి తర్వాత చాటింపు చేయించి మరీ వసూలు చేసి పరారు.తర్వాత నెలలు గడిచిన రాని లేబర్ కార్డ్స్ అయోమయంలో ప్రజలు,ఫోన్ చేస్తే అవుతున్నాయి.టైం పడుతుంది.ఇంకొన్ని రోజులు టైం పడుతుంది. అంటూ కాలక్షేపం చేస్తూ ముందుకు సాగిస్తుంది. మహిళ పేరు శిరీష లేబర్ కార్డ్స్ కోసం ములుగు జిల్లా భూపాలపల్లి జిల్లాలోని తండాలు, గ్రామపంచాయతీలో టార్గెట్ పెట్టుకొని వసూలు చేస్తుంది. ఒక గ్రామంలో 10 నుంచి 20,000 ఇంకొక గ్రామంలో 20 నుంచి 30 వేల వరకు వసూలు చేసి మాయమవుతుంది. ఇందులో విషయం ఏంటంటే 60 సంవత్సరాలు దాటిన వారు కూడా లేబర్ కార్డు ఇప్పిస్తానని డబ్బులు తీసుకోవడం చాలా దారుణం.వాస్తవానికి లేబర్ కార్డు పథకం ప్రకారం 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల వరకు ఉన్న వారికి మాత్రమే లేబర్ కార్డు అనేది వర్తించడం జరుగుతుంది.రావడం జరుగుతుంది.
అధికారులకు అవసరం లేదా…
గ్రామ ప్రజలు సదర్ మహిళపై లేబర్ ఆఫీసులో ఫిర్యాదు చేసిన లాభం లేకుండా పోయింది. పోలీసు అధికారులకు ఫిర్యాదు చేసిన లాభం లేకుండా పోయింది. ఏ అధికారి పట్టించుకోకపోవడం వలన ఇలాంటివి జరుగుతున్నాయని ప్రజలు తెలుపుతున్నారు.
లేబర్ కార్డ్ వల్ల లాభాలు
ఈ పథకం వల్ల భవన నిర్మాణ కార్మికులకు వాళ్ళ ఇంట్లో ఆడబిడ్డ కు పెళ్లయిన ప్రసవం అయిన 30 వేల చొప్పున ప్రభుత్వం అందిస్తుంది.అకాల అంగవైకల్యం రెండు లక్షలు, ప్రమాదంలో మరణించినట్లయితే ఆరు లక్షలు, ప్రమాదంలో ఏమైనా జరిగిన ఒక లక్ష రూపాయల వరకు వర్తిస్తాయి.




