Thursday, 5 November 2026

లైంగిక వేధింపులపై కమిటీ

హైకోర్టు సిజెలకు సుప్రీం ఆదేశాలు
న్యూఢిల్లీ,మే11(జ‌నం సాక్షి ): రెండు నెలల్లోగా లైంగిక వ్యతిరేక వేధింపుల కమిటీలను ఏర్పాటు చేయాలని అన్ని రాష్టాల్లోన్రి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులకు, యాక్టింగ్‌ చీఫ్‌ జస్టిస్‌లకు సుప్రీంకోర్టు శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. పని ప్రదేశాల్లో మహిళలపై లైంగిక వేధింపుల చట్టం 2013 ప్రకారం( నివారణ, నిషేధం, పరిష్కారం), లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా వారంలోనే ఢిల్లీ హైకోర్టు, అన్ని జిల్లా కోర్టుల్లో ఒక కమిటిని ఏర్పాటు చేయాలని ఢిల్లీ హైకోర్టు యాక్టింగ్‌ ఛీఫ్‌ జస్టిస్‌ గీతామిట్టల్‌కు ఆదేశాలు జారీ చేసింది. పని ప్రదేశంలో లైంగిక వేధింపుల కేసులను విచారించేందుకు అంతర్గత ఫిర్యాదుల కమిటీలను ఏర్పాటు
చేయడానికి చట్టాలు అవసరమని, 10 కంటే తక్కువ ఉద్యోగులతో పనిచేసే ప్రదేశాల్లో, యజమానిపై ఆరోపణలు చేసినప్పుడు, జిల్లా అధికారులు చట్టం సెక్షన్‌ 6 ప్రకారం ఫిర్యాదులను స్వీకరించడానికి స్థానిక కమిటీలు ఏర్పాటు చేయాలని తెలిపింది.