Thursday, 5 November 2026

అమిత్‌షాపై దాడి బాబు ఆదేశాలతో జరిగిందా?: విష్ణు

విశాఖపట్టణం,మే11(జ‌నం సాక్షి ):  బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షాపై అలిపిరి వద్ద దాడిని ఖండిస్తున్నామని ఆ పార్టీ నేత విష్ణుకుమార్‌రాజు అన్నారు. శుక్రవారం ఆయన విూడియాతో మాట్లాడుతూ టిడిపి కార్యకర్తలు కావాలనే దాడి చేశారా? లేక సీఎం ఆదేశాల మేరకు దాడి చేశారో తేలాల్సి ఉందని ఆయన అన్నారు. అమిత్‌షాకు భద్రత కల్పిచడంలో పోలీసులు విఫలమయ్యారని ఆయన విమర్శించారు. దీనికి బాధ్యులైన పోలీసులను వెంటనే సస్పెండ్‌ చేయాలని విష్ణుకుమార్‌రాజు డిమాండ్‌ చేశారు. టిడిపి కార్యకర్తలు గూండాల్లా వ్యవహరించారని, వారిని జైల్లో పెట్టాలని ఆయన అన్నారు. టిడిపి కార్యకర్తలు ఏపీ ప్రజల పరువు తీశారన్నారు. 2019 ఎన్నికల్లో టిడిపి గెలవదని విష్ణుకుమార్‌రాజు జోస్యం చెప్పారు.