Wednesday, 4 November 2026

లైసెన్సులు ఆలస్యంతో నాటు తుపాకులపై గురి…?

అనంతపురం,నవంబర్‌21:సంవత్సరాల తరబడి దరఖాస్తులు పెండింగులో ఉన్నాయి. ప్రభుత్వం మంజూరు చేసే తుపాకుల లైసెన్సులపై ఆశలు వదులుకున్న పలువురు అక్రమంగా తుపాకులను కొనుగోలు చేసేందుకు సిద్ధపడ్డారనే ఆరోపణలున్నాయి. ఇందులో భాగంగా అనంతపురం, కడప, కర్నూలు, బళ్లారి తదితర జిల్లాల నేతలు, ఫ్యాక్షనిస్టులతో ఉన్న సంబంధాలను ఉపయోగించుకుని తుపాకుల కొనుగోలుపై దృష్టిపెట్టార నే ప్రచారముంది. గతంలో జరిగిన అనేక పోలీసు దాడుల్లో అక్రమ తుపాకు లు బయటపడ్డాయి. దీంతో  అక్రమ తుపాకులు, బాంబుల ఏరివేతకు పోలీసులు నడుంబిగించారు. కేవలం వారం రోజుల వ్యవధిలో రెండు తుపాకులతో పాటు బుల్లెట్లు, బాంబులను స్వాధీనం చేసుకున్నారు. దీనికారణంగా అనేకమంది అక్రమ తుపాకుల కొనుగోలుపై ఆసక్తి చూపారు. ప్రధానంగా రాజకీయ మద్దతుదారులు, వ్యాపారస్థులు, భూసెటిల్మెంట్లు చేసేవారు ఇందులో ఉన్నారు.ప్రస్తుతం వీరికి ప్రత్యర్థుల నుంచి ప్రాణభయం పట్టుకుంది. ఆత్మరక్షణ పేరుతో తుపాకుల లైసెన్సుల కోసం ప్రభు త్వానికి దరఖాస్తు చేస్తున్నారు.  గతంలో పెద్దఎత్తున తుపాకులను ఏరివేశారు.పోలీసుల ఉదాసీనత వల్ల పలువురు ఆత్మరక్షణ పేరుతో తుపాకుల కొనుగోలుకు ముందుకు వచ్చారనే ప్రచారముంది. తాడిపత్రి ప్రాంతానికి రాజకీయంగానూ, ఫ్యాక్షనిజం పరంగానూ జిల్లాలో ప్రత్యేకస్థానముంది. కడప, కర్నూలు, అనంతపురం జిల్లాలకు తాడిపత్రి సరిహద్దు కేంద్రంగా ఉంటోంది.  దీన్ని కేంద్రంగా చేసుకుని ఆయా జిల్లాల ఫ్యాక్షనిస్టులు, రాజకీయ మద్దతుదారులు తమ ప్రత్యర్థులను హతమార్చారు. ప్రత్యర్థుల నుంచి తమ ప్రాణాలను కాపాడుకునేందుకు సరిహద్దు జిల్లాల్లోని నేతలు, ఫ్యాక్షనిస్టులు తాడిపత్రి పట్టణాన్ని నివాస కేంద్రంగా చేసుకున్నారు. తాడిపత్రి ప్రాంతంలో తుపాకుల ఏరివేతపై పోలీసు శాఖ దృష్టిపెట్టింది. ఇన్నాళ్లూ వాటి గురించి కొందరికి తెలిసినా పట్టనట్లు- వ్యవహరిస్తూ వచ్చారనే ఆరోపణలున్నాయి. రాజకీయంగా, ఫ్యాక్షనిజం పరంగా ఎంతో ప్రభావి తమైన తాడిపత్రి ప్రాంతంలో పనిచే సే పోలీసు అధికారులకు విధినిర్వహణ కత్తివిూద సామే. దీనివల్ల తరు వాత పనిచేసిన పోలీసు అధికారులు రాజకీయ పరిస్థితులు, ఇతర ఒత్తిళ్లకు తలొగ్గి వాటిజోలికెళ్లి ఇబ్బందులు తెచ్చుకోవడమెందుకనే ఆలోచనతో వెనుకంజ వేశారు. కొందరు పోలీసు అధికారులకు రాజకీయనేతలతో ఉన్న సంబంధాల వల్ల కూడా తుపాకుల ఏరివేతపై దృష్టిపెట్టలేదని ప్రచార ముంది. తాడిపత్రి పట్టణంలో జరిగిన చింబిలి వెంకటరమణ హత్యకేసులో  యాడికి మండలం గుడిపాడుకు చెందిన పలువురిని అరెస్టు చేసి వారివద్ద ఉన్న తుపాకీతో పాటు రెండు బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. బ్రాహ్మణపల్లిలో పెద్దిరెడ్డి తోపాటు మరికొందరి ఇళ్లపై  దాడులు జరిపి 10నాటు బాంబులను స్వాధీనం చేసుకున్నారు.  తుపాకుల ఏరి వేత కార్యక్రమం చేపట్టిన కేవలం వారంరోజుల వ్యవధిలో రెండు తుపాకులు స్వాధీనం చేసుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *