పోటీ చేయని టిడిపి నేతలు కూడా పోటీకి సిద్దం
మళ్లీ పొత్తులతో వ్యవహారం చెడుతుందన్న భావనలో నేతలు
హైదరాబాద్,డిసెంబర్29(జనంసాక్షి): వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో 16 సీట్లు గెలుస్తామని టిఆర్‌ఎస్ ప్రకటిస్తుండగా, తామూ బరిలో ఉంటామని కాంగ్రెస్, టిడిపిలు కూడా ప్రకటిస్తున్నాయి. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిన, పోటీ చేయని నేతలు ఇప్పుడు లోక్‌సభ స్థానాలపై గురి పెట్టాయి. గెలుపోటములను పక్కన పెట్టి పోటీ చేయడమే లక్ష్యంగా వీరు పావులు కదుపుతున్నారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్,టిడిపిల పొత్తు వికటించింది. దీంతో ఈ మారు కలసి పోటీ చేస్తారా లేక విడివిడిగా అన్నది కూడా
తెలియదు. అయితే చంద్రబాబుతో కలసి పోటీ చేయడం వల్ల బెడిసి కొట్టిందనే వాదనలను పిసిసి చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఖండించారు. కాంగ్రెస్ నుంచి ఓటమి పాలయిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, సర్వే సత్యానారయణ, జీవన్ రెడ్డి, డికె అరుణ, రేవంత్ రెడ్డి, జె. గీతారెడ్డి,జానారెడ్డి తదితరులు పార్లమెంట్ బరిలో దిగే యోచనలో ఉన్నారు. అలాగే టిడిపి నుంచి మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్న పార్టీ అధ్యక్షుడు ఎల్. రమణ,పెద్దిరెడ్డి, రావుల చంద్రశేఖర్ రెడ్డి తదితరులు కూడా లోక్‌సభ బరిలో దిగాలని ఆలోచన చేస్తున్నారు. మొన్నటి ఎన్నికల్లో కేసీఆర్‌ను గ్దదెదించడమే లక్ష్యంగా కలసి పోటీ చేశారు. ఇప్పుడు బరిలోకి దిగాలనుకుంటున్న వారంతా పరస్పరం పోటీ పడాల్సిన అవసరం ఉంది. వారు
కోరుకుంటున్న నియోజకవర్గాల్లో పోటీ చేయడం వల్ల్ పోటీ తప్పేలా లేదు. అందువల్ల వీరు మళ్లీ కలస ఇపోటీ చేస్తారా లేక విడివిడిగా పోటీ చేస్తారా అన్నది చూడాలి. తెలంగాణ ఎన్నికల్లో సిద్దాంతాలను సైతం పక్కనబెట్టి కాంగ్రెస్, టీడీపీ, తెలంగాణ జనసమితి, సీపీఐలు కూటమిగా ఏర్పడ్డాయి. కేసీఆర్‌ను గద్దెదించడమే లక్ష్యంగా బరిలోకి దిగాయి. లోపాయకారి వ్యూహాలతో ఎదురు దెబ్బలు తిన్నారు. తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణతో పాటు సీనియర్ నేతలు రావుల చంద్రశేఖర్‌రెడ్డి, పెద్దిరెడ్డి, మండవ వెంకటేశ్వరరావు మొన్నటి ఎన్నికల్లో పొటీచేయలేదు. టీడీపీలో ఈ సీనియర్ నేతలు పోటీకి దూరంగా ఉండటంతో ఇప్పుడు వారంతా లోక్‌సభపై గురి పెట్టారు. జగిత్యాలలో కాంగ్రెస్ అభ్యర్థి జీవన్‌రెడ్డి పొటీచేస్తుండటంతో ఎల్.రమణ తాను బరిలోకి దిగలేదు. ఇక రావుల చంద్రశేఖర్ రెడ్డి కూడా వనపర్తిలో కాంగ్రెస్ నేత చిన్నారెడ్డి బరిలో ఉండటం వల్లే పోటీకి దూరంగా ఉన్నారు. కూకట్‌పల్లిలో నందమూరి సుహాసిని కోసం పెద్దిరెడ్డి పోటీ నుంచి విరమించుకోవాల్సి వచ్చింది. అటు నిజామాబాద్ రూరల్‌లో కాంగ్రెస్ అభ్యర్థి పోటీచేస్తున్న కారణంగా మండవ వెంకటేశ్వరరావు పోటీ పడలేదు. తాజాగా ఈ నలుగురు నేతలు లోక్‌సభకు పోటీచేయాలని ఆసక్తితో ఉన్నారని సమాచారం. అయితే వీరు పోటీ చేయాలనుకుంటున్న సీట్లలో కాంగ్రెస్ ఓటమి నేతలు కూడా రెడీగా ఉన్నారు. మల్కాజ్‌గిరి లేదా కరీంనగర్ నుంచి ఎంపీగా పోటీ చేసేందుకు ఎల్.రమణ ఉత్సాహ పడుతున్నారు. అయితే కరీంనగర్ టికెట్ తనకే కావాలన్న పట్టుదలతో పెద్దిరెడ్డి ఉన్నారని సమాచారం. ఇక్కడి నుంచి కాంగ్రెస్ అభ్యర్థులుగా పొన్నం ప్రభాకర్, జీవన్ రెడ్డిలు సైతం పోటీ పడుతున్నారు. ఇక ఉమ్మడి పాలమూరు జిల్లాలోని కాంగ్రెస్ కీలక నేతలంతా అసెంబ్లీ బరిలో ఓటమి చెందడంతో లోక్‌సభ ఎన్నికలపై దృష్టి పెట్టారు. మహబూబ్‌నగర్ నుంచి పోటీ చేయాలను కుంటున్న రావుల చంద్రశేఖర్ రెడ్డికి వీరంతా పోటీగా తయారయ్యారు. ఇక్కడి నుంచి రేవంత్ రెడ్డి, డికె అరుణ పోటీ పడుతున్నట్లు సమాచారం. దీంతో పొత్తుల వల్ల టిడిపికి లాభం లేకపోవచ్చు. ఇకపోతే మాజీమంత్రి మండవ వెంకటేశ్ర రావు కూడా కూడా నిజామాబాద్ లేదా మరే స్థానం నుంచైనా పోటీచేయాలని భావిస్తున్‌ఆనరని సమాచారం. అయితే టీడీపీ ముఖ్యుల పోటీకి కాంగ్రెస్ పొత్తు వికటించేలా ఉంది. పొన్నం ప్రభాకర్‌తో పాటు సర్వే సత్యనారాయణ, డీకే అరుణ, రేవంత్‌రెడ్డి, జానారెడ్డి,కోమటిరెడ్డి ఓటమి పాలయ్యారు. దీంతో వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో కరీంనగర్ నుంచి పొన్నం ప్రభాకర్, మల్కాజ్‌గిరి నుంచి సర్వే సత్యనారాయణ, మహబూబ్‌నగర్ నుంచి రేవంత్ లేదా డీకే అరుణను రంగంలోకి దింపే యోచనలో కాంగ్రెస్‌పార్టీ ఉందని తెలుస్తోంది. దీంతో పొత్తు కలిసి వచ్చి ఎంపీగా పోటీచేసి గెలవాలన్న టీడీపీ ముఖ్యనేతల ఆశలపై నీళ్లు జల్లినట్టు అయ్యింది. మరోవైపు మహబూబ్‌నగర్ నుంచి జైపాల్ రెడ్డి కూడా రంగంలో ఉండబోతున్నారని సమాచారం. దీంతో టిడిపితో పొత్తు వల్ల కాంగ్రెస్ నేతలకు కూడా సంకటం కానుంది. అలాగే కాంగ్రెస్‌తో పొత్తు వల్ల తమకూ విఘాతం కానుందని టిడిపి నేతలు
భావిస్తున్నారు. దీంతో వచ్చే ఎన్నికల్లో పొత్తులు కుదురుతాయా లేదా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఒకవేళ కాంగ్రెస్ అధిష్టానం ఓటమి పాలయిన వారిని దూరం పెడితే తప్ప పొత్తులకు అవకాశం ఉండకపోవచ్చు.
లోక్‌సభకు రెడీ అవుతున్న కాంగ్రెస్ ఓటమి వీరులు




