వంచన, మోసం కలిపితే జగన్
– వీక్లీఆఫ్లతో పాదయాత్ర చేస్తున్న ఏకైక నాయకుడు జగన్మోహన్రెడ్డి
– కేంద్రానికి కొమ్ముకాయడానికే వైసీపీ వంచన దీక్ష
– ఏపీ మంత్రి పత్తిపాటి పుల్లారావు
గుంటూరు, ఆగస్టు9(జనం సాక్షి) : వంచన, మోసం కలిపి వైసీపీ అధినేత జగన్మోహన్రెడ్డి అని మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గురువారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. దేనికోసం వచన దీక్షలు చేస్తున్నారని వైసీపీ నేతలను ప్రశ్నించారు. కేంద్రం, బీజేపీ వెనకేసుకురాడానికే దీక్షలు చేస్తున్నారా అని నిలదీశారు. వంచన, మోసం కలిపితే జగన్మోహన్రెడ్డి అని మంత్రి వ్యాఖ్యానించారు. వీక్లీఆఫ్లు తీసుకుని పాదయాత్ర చేస్తున్న ఏకైక నాయకుడు జగన్ అని ఎద్దేవా చేశారు. కేంద్రానికి కొమ్ముకాయడానికే వైసీపీ వంచన దీక్షలు చేస్తోందని విమర్శించారు. రాష్టాన్ని వంచించింది జగన్మోహన్రెడ్డి కాదా అని మంత్రి మండిపడ్డారు. రాష్ట్రానికి ప్రాజెక్టులు రాకుండా చేసిన వారు టీడీపీ గురించి మాట్లాడటం హాస్యాస్పదమని మంత్రి అన్నారు. బీజేపీతో వైసీపీ లాలూచీ పడి కుట్ర రాజకీయాలు చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కడప జిల్లాలో అభివృద్ధిని జగన్ అడ్డుకుంటున్నారని మంత్రి ఆరోపించారు. కడప ఉక్కఫ్యాక్టరీ విషయంలో కేంద్రం అన్యాయం చేసినా జగన్ ప్రశ్నించకపోవడం వెనక ఆంతర్యమేంటని ప్రశ్నించారు. అధికారం కోసం అమలు కాని హావిూలు ఇచ్చి ప్రజలను వంచించే ప్రయత్నం చేస్తున్నారని మంత్రి అన్నారు. ఏపీకి న్యాయం కోసం టీడీపీ ఎంపీలు పోరాడుతుంటే వైసీపీ ఎంపీలు కేంద్ర పెద్దల వద్ద లాలూచీ రాజకీయాలు చేయడం వంచనకాదా అని నిలదీశారు. యువతకు అందిస్తున్న యువనేస్తాన్ని చూసి వైసీపీ జీర్ణించుకోలేకపోతోందని మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు విమర్శించారు.