హైదరాబాద్,నవంబర్5(జనంసాక్షి): కాంగ్రెస్ నేత వంటేరు ప్రతాప్ రెడ్డి, భాజపా నేత, శ్రీపీఠం అధిపతి స్వామి పరిపూర్ణానందపై తెరాస నేతలు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్‌కుమార్‌కు ఫిర్యాదు చేశారు. సోమవారం రజత్‌కుమార్‌ను కలిసి ఇటీవల మంత్రి హరీశ్‌రావుపై గజ్వేల్‌లో వంటేరు ప్రతాప్‌రెడ్డి చేసిన వ్యాఖ్యల వీడియోను కూడా అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. హరీశ్‌రావుపై ఒంటేరు ప్రతాప్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సరైనవి కాదన్నారు. ఫిర్యాదుతో పాటు ప్రతాప్‌రెడ్డి వ్యాఖ్యల వీడియోనూ రజత్‌కుమార్‌కు అందజేసినట్టు తెలిపారు. అలాగే, స్వామి పరిపూర్ణానంద తమపై చేసిన వ్యాఖ్యలపైనా చర్యలు తీసుకోవాలని కోరినట్టు చెప్పారు. వీరిపై చర్య తీసుకోవాలని కోరామని అన్నారు.




