విజయవాడ : వందేళ్లకు ముందే బ్రిటిషువారు తెలుగులో తీర్పులు వెలువరించారని అయితే మనం మాతృభాష తెలుగులో తీర్పులు వెలువరించకపోవడం బాధాకరమని జస్టిన్ రమణ అన్నారు. నగరంలో ఏర్పాటుచేసిన ‘తెలుగులో న్యాయపాలన’ పదస్సులో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ తల్లి గర్భంలో ఉన్నప్పుడే మాతృభాషను నేర్చుకుంటామని మాతృభాషను గౌరవించుకోవాల్సిన అవసరం ఎంతో వుందని అన్నారు. తల్లికి సమస్కరించడం మాతృభాషను గౌరవించడం రెండూ ఒకటేనన్నారు. జనాభా ప్రాతిపదికన తెలుగు భాషాభివృద్ధి జరగడం లేదని కుచించుకుపోతుందని ఆవేదన వ్యక్తంచేశారు. తెలుగు భాషాభివృద్ధికి ప్రజల సహకారంతో పాటు పాలకుల సహకారం కావాలని జస్టిస్ చంద్రయ్య అన్నారు.




