పార్లమెంటు వేదికగా మోడీ క్షమాపణ చెప్పాలి
ఉభయ సభల్లో విపక్షాల డిమాండ్
న్యూఢిల్లీ, నవంబర్ 26 (జనంసాక్షి) : వంద రోజుల్లో నల్లధనం వెనక్కి రప్పిస్తామని హామీనిచ్చారు.. ‘వంద రోజులు గడిచాయి.. బ్లాక్‌మనీ ఎక్కడ? అని అధికార పక్షాన్ని విపక్ష సభ్యులు నిలదీశారు. పార్లమెంటు వేదికగా ప్రధానమంత్రి నరేంద్రమోడీ క్షమాపణ చెప్పాలని ఉభయ సభల్లో విపక్షాలు డిమాండ్ చేశాయి. పార్లమెంటు శీతాకాల సమావేశాల వేడిని అధికార పక్షం మొదటిరోజే చవిచూసింది. ఉభయసభలు ఉదయం ప్రారంభం కావడంతోనే బ్లాక్ మనీ ఎక్కడ? అనే నినాదాలతో ¬రెత్తాయి. నల్లధనం విషయంలో బీజేపీ తన ఎన్నికల హావిూని అమలుచేయడంలో విఫలమైందంటూ ప్రతిపక్షాలు ఐక్యంగా గళమెత్తాయి. బ్లాక్‌మనీని భారత్‌కు తిరిగి తెప్పించేందుకు చేపట్టిన చర్యలను సభకు వివరించాలని డిమాండ్ చేశాయి. ప్రతిపక్షాల ఆందోళన నేపథ్యంలో ఈ అంశంపై బుధవారం చర్చించేందుకు ప్రభుత్వం అంగీకరించింది. అంతకుముందు లోక్‌సభ ప్రారంభం కాగానే కాంగ్రెస్, సమాజ్‌వాదీ, తృణమూల్ కాంగ్రెస్, ఆప్.. తదితర పార్టీల ఎంపీలు నల్లధనం అంశంపై సభలో నినాదాలు మొదలెట్టారు. అయితే స్పీకర్ సుమిత్రా మహాజన్ సభా కార్యక్రమాలను ప్రారంభించడంతో వారు వెల్‌లోకి దూసుకెళ్లి నినాదాలు చేశారు. తృణమూల్ ఎంపీలు ‘నల్ల ధనాన్ని వెనక్కు తెండి’ అని రాసిన నల్ల గొడుగులను ప్రదర్శించారు. ఈ విషయంలో చేపట్టిన చర్యలను సభకు వివరిస్తామని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి వెంకయ్యనాయుడు హావిూ ఇచ్చినా వారు వినిపించుకోలేదు. బ్లాక్‌మనీ విషయంలో ఎన్నికల ప్రచారంలో నరేంద్రమోదీ సహా బీజేపీ నేతలంతా యూపీఏ ప్రభుత్వాన్ని అప్రదిష్టపాలు చేశారని, అందుకు ప్రభుత్వం క్షమాపణ చెప్పాలని లోక్‌సభలో ప్రతిపక్ష నేత మల్లిఖార్జున్ ఖర్గే డిమాండ్ చేశారు. దానికి ‘గత 50 ఏళ్ల కాంగ్రెస్ పాలనలోనే ఎక్కువ బ్లాక్‌మనీ దేశం నుంచి తరలివెళ్లింది’ అని వెంకయ్య బదులిచ్చారు. ప్రశ్నోత్తరాల సమయాన్ని రద్దు చేసి బ్లాక్‌మనీపై చర్చ చేపట్టాలన్న కాంగ్రెస్ డిమాండ్‌ను తోసిపుచ్చిన స్పీకర్ గందరగోళం మధ్యనే క్వశ్చన్ అవర్‌ను ప్రారంభించారు. మరోవైపు రాజ్యసభలోనూ తృణమూల్ కాంగ్రెస్, సమాజ్‌వాదీ, జేడీయూ సభ్యులు ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో సభ కార్యకలాపాలను కూడా అడ్డుకున్నారు. మధ్యాహ్న భోజన విరామం అనంతరం టీఎంసీ ఎంపీ డెరెక్ ఒబ్రీన్ నల్లధనం అంశాన్ని లేవనెత్తారు. ప్రభుత్వం బ్లాక్‌మనీని వెనక్కు తెస్తుందని ప్రజలు ఆశించినా ఆ హావిూని సర్కారు నిలుపుకోవడంలేదని విమర్శించారు. అయితే దీనిపై చర్చకు సిద్ధంగా ఉన్నామంటూ ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ స్పష్టం చేశారు.
నల్లధనంపై రాజ్యసభలో అరుణ్‌జైట్లీ వివరణ
కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ రాజ్యసభలో నల్లధనం అంశంపై ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై వివరణ ఇచ్చారు. పార్లమెంటు ఉభయసభల్లో నల్లధనం అంశంపై ఈరోజు చర్చ జరిగింది. ఈ సందర్భంగా విపక్షాల ప్రశ్నలకు మంత్రి సమాధానం ఇచ్చారు. 427 మందికి విదేశీ ఖాతాలున్నట్లు ప్రభుత్వం గుర్తించిందని, వారందరికీ నోటీసులు జారీ చేసిందని జైట్లీ తెలిపారు. 250మంది తమకు హెచ్‌ఎస్‌బీసీలో ఖాతాలున్నట్లు అంగీకరించారన్నారు. చట్టానికి లోబడి ఉన్న ఖాతాల జోలికి తాము వెళ్లమన్నారు. కొన్ని వారాల్లో మరిన్ని కేసులు నమోదుచేస్తామని, విచారణ ప్రారంభమయ్యాక ఖాతాదారుల పేర్లు వెల్లడిస్తామని జైట్లీ తెలిపారు. నల్లధనంపై ప్రభుత్వ స్పందనకు నిరసనగా కాంగ్రెస్, టీఎంసీ, వామపక్షాలు సభ నుంచి వాకౌట్ చేశాయి.





