వచ్చే ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌దే విజయం

– నాలుగేళ్లలో అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాం
– దేశంలోనే తెలంగాణను అగ్రస్థానంలో నిలుపుతాం
– గత ప్రభుత్వాల హయాంలో పరిశ్రమలకు పవర్‌హాలిడే ప్రకటించేవారు
– కేసీఆర్‌ పాలనలో ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకున్నాం
– ఆపద్ధర్మ మంత్రి కేటీఆర్‌
హైదరాబాద్‌, అక్టోబర్‌10(జ‌నంసాక్షి) : వచ్చే ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌దే విజయమని, తమ విజయాన్ని అడ్డుకోవటం ఎన్ని కూటములు వచ్చినా సాధ్యం కాదని ఆపద్ధర్మ మంత్రి కేటీఆర్‌ స్పష్టం చేశారు.
బుధవారం బంజారాహిల్స్‌ రోడ్‌ నెం.12లోమహారాజ శ్రీఅగ్రసేన్‌ 5142వ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో కేటీఆర్‌ పాల్గొని ప్రసంగించారు. టీఆర్‌ఎస్‌ హయాంలో పరిశ్రమలకు నిరంతర విద్యుత్‌ ఇస్తున్నామన్నామని తెలిపారు. గత ప్రభుత్వాల హయాంలో పరిశ్రమలకు పవర్‌ హాలిడే ప్రకటించేవారని మంత్రి అన్నారు. 15 రోజుల్లోనే పరిశ్రమలకు అనుమతి ఇస్తున్నామని కేటీఆర్‌ పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం అన్ని రంగాలకు పెద్దపీట వేస్తోందని, వ్యాపారులు, వర్తకులు, పారిశ్రామికవేత్తలకు ఇతోధిక ప్రోత్సాహకాలు అందిస్తోందన్నారు. టీఎస్‌ ఐపాస్‌ ద్వారా పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయని తెలిపారు. పదిహేను రోజుల్లోనే పరిశ్రమలకు అనుమతి ఇస్తున్నామని తెలియజేశారు. వ్యవసాయ రంగం, రైతుల సంక్షేమం కోసం చర్యలు చేపట్టామని వివరించారు. పరిశ్రమల స్థాపనకు ముందుకొచ్చే పారిశ్రామికవేత్తలకు సత్వర అనుమతులు ఇస్తున్నామని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రస్థానంలో నిలుపుతామని మంత్రి కేటీఆర్‌ అన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీసీఎం మహమూద్‌ అలీ, మంత్రి కేటీఆర్‌, మాజీ సీఎం గవర్నర్‌, ఎమ్మెల్సీ శ్రీనివాస్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఆర్‌.కృష్ణయ్య పాల్గొన్నారు. రాబోయే ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌దే విజయం తద్యమన్నారు. ఎవరెన్ని కూటములు కట్టినా తెరాస గెలుపును ఎవరూ అడ్డుకోలేరన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రస్థానంలో నిలుపుతామన్నారు. తెలంగాణ అభివృద్ధికి విూ అందరి సహకారం కూడా అవసరమని కేటీఆర్‌ కోరారు. ఈ జయంతి వేడుకల్లో తమిళనాడు మాజీ గవర్నర్‌ కోణిజేటి రోశయ్య ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ
కార్యక్రమంలో డిప్యూటీ సీఎం మహమూద్‌ అలీ, ఎమ్మెల్సీ శ్రీనివాస్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఆర్‌.కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు.