Monday, 2 November 2026

వచ్చే ఎన్నికల్లో ప్రత్యర్థి కాంగ్రెస్సే..

ktr-facebook-3x2-newఒక చారిత్రక ఘట్టంలో పాలన చేపట్టిన కేసీఆర్ ప్రభుత్వం రెండున్నర ఏండ్ల స్వల్ప వ్యవధిలోనే ప్రజల అచంచల విశ్వాసాన్ని చూరగొన్నదని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, పురపాలక శాఖల మంత్రి కే తారకరామారావు చెప్పారు. అభివృద్ధిని, సంక్షేమాన్ని రంగరించి దేశం యావత్తూ మనవైపు ఆసక్తిగా చూసేలా జనరంజక పాలన సాగిస్తున్నామని ఆయన అన్నారు. తమ ప్రభుత్వానికి ప్రజల హితం తప్ప మరో ప్రాధాన్యత లేదని స్పష్టం చేశారు. శాంతి భద్రతలు, వ్యవసాయం, నీటిపారుదల, విద్యుత్తు, తాగునీరు, విద్య, వైద్య రంగాల్లో భారీ ప్రణాళికలతో అనేక మైలురాళ్లు దాటుతూ ముందుకు వెళుతున్నారు. వచ్చే ఎన్నికల్లో పోటీయే ఉండదు అంటే అది అహంకారం అవుతుంది. పోటీ ఉంటుంది. 99 శాతం కాంగ్రెస్ తోనే ఉంటుంది. కాకపోతే అడుగు, బొడుగు…గడ్డాలు పెంచుకున్న నాయకులతో పోటీ పడాల్సి వస్తుందేమో అని అన్నారు. పారిశ్రామికంగా మన పురోగతి చెప్పుకోదగింది. అత్యుత్తమ పాలసీతో ప్రపంచంలోని నాలుగు టాప్ కంపెనీలు వచ్చాయి. భారీ స్థాయిలో ఆపిల్, గూగుల్, మైక్రోసాఫ్ట్, ఊబర్‌లు ఇక్కడ కొలువుదీరాయి. ఇంటింటికీ ఇంటర్నెట్‌లో భాగంగా ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టులో 2000 కిలోమీటర్లు పూర్తయింది. యాభై వేల కిలోమీటర్ల లక్ష్యం. 12వేల ఎకరాల ఫార్మాసిటీలో 6వేల ఎకరాల భూసేకరణ పూర్తయింది. 2000 ఎకరాలలో నిమ్జ్ రానుంది. ఈజ్ ఆఫ్ డూయింగ్‌లో టాప్ ర్యాంకు సాధించాం. ఐటీఐఆర్ విషయంలో కేంద్రం స్పష్టత ఇవ్వకపోయినప్పటికీ పరిశ్రమ అభివృద్ధి కొనసాగేలా ప్రణాళికలు సిద్ధం చేశాం అని అన్నారు.  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *