Monday, 2 November 2026

వచ్చే జూన్‌2 నాటికి.. 

సీఎంగా కేసీఆర్‌ ఉండరు
– తెలంగాణ ఇచ్చింది సోనియాగాంధీనే
– తెరాస పుట్టకముందే మేము తెలంగాణ ఇవ్వాలని కేంద్రాన్ని కోరాం
– సమస్యలపై ప్రశ్నించిన వారిని జైలుకు పంపుతున్నారు
– కేసీఆర్‌ ఇంటికి పంపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు
– టీకాంగ్రెస్‌ చీఫ్‌ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి
హైదరాబాద్‌, జూన్‌2(జ‌నం సాక్షి) : తెలంగాణలో కేసీఆర్‌ కుటుంబ పాలన సాగుతుందని, కేసీఆర్‌ తీరుపట్ల ప్రజలు ఆగ్రహావేశాలతో ఉన్నారని.. వచ్చే జూన్‌ 2 నాటికి ముఖ్యమంత్రిగా కేసీఆర్‌ ఉండరని టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి అన్నారు. శనివారం గాంధీభవన్‌లో ‘దగాపడ్డ తెలంగాణ’ కరపత్రాన్ని ఉత్తమ్‌ విడుదల చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలకు రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన విూడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రావటం ఖాయమని, దీనిని ఎవరూ అడ్డుకోలేరని ఉత్తమ్‌ ధీమా వ్యక్తం చేశారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా, ఎందరో అడ్డుతగిలినా సోనియా తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చారన్నారు. తెలంగాణ చరిత్రలో సోనియా పేరు సువర్ణాక్షరాలతో లిఖించపడుతుందని పేర్కొన్నారు. టీఆర్‌ఎస్‌ పుట్టకముందే తాము తెలంగాణ ఇవ్వాలని కేంద్రాన్ని కోరామని అన్నారు. తెలంగాణ ఉద్యమాన్ని మొదలుపెట్టింది, తెచ్చింది, ఇచ్చింది కాంగ్రెస్‌ పార్టీ నేని ఉత్తమ్‌ స్పష్టం చేశారు. అయినా ప్రజా తీర్పును గౌరవించి ప్రతిపక్షంగా ప్రజలపక్షాణ పోరాడుతున్నామని తెలిపారు. అమలు కాని హావిూలతో కేసీఆర్‌ ప్రజలను మోసం చేస్తున్నారని ఉత్తమ్‌ మండిపడ్డాడు. రైతురుణ మాఫీ చేస్తామని కేసీఆర్‌ మోసం చేశారని ఆరోపించారు. ఒక్క హావిూని కూడా కేసీఆర్‌ అమలు చేయలేదని అన్నారు. ప్రశ్నించినవారిని జైలుకు పంపుతున్నారని మండిపడ్డారు. కేసీఆర్‌ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు.
టిఆర్‌ఎస్‌ నిర్లక్ష్య వైఖరి వల్ల నాలుగేళ్లలో నాలుగు వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారనిఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి తెలిపారు.  ఖమ్మం, వరంగల్‌, వికారాబాద్‌లో పంటకు గిట్టుబాటు ధర కోసం రైతులతో కలిసి పోరాటం చేశామన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కెసిఆర్‌ పాలనలో దళితులు, మైనార్టీలు, బిసిలకు న్యాయం జరగలేదని మండిపడ్డారు. ప్రధాన ప్రతిపక్షంగా రైతుల తరపున అనేక ఉద్యమాలు చేశామని వివరించారు. న్యాయం కోసం పోరాడిన సామాన్యుల పట్ల ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరించిందని మండిపడ్డారు. ఖమ్మంలో మిర్చికి మద్దతు ధర అడిగిన రైతులకు బేడీలు వేసి అరెస్టు చేశారని, ముస్లింలకు రిజర్వేషన్లు పెంచుతూ చేసిన తీర్మానానికి కాంగ్రెస్‌ మద్దతు తెలిపిందని గుర్తు చేశారు. వ్యవసాయ రుణాలపై వడ్డీ భరిస్తామని సిఎం హావిూ ఇచ్చి మోసం చేశారని కెసిఆర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు.
కెసిఆర్‌కు రంగంస్థలం చూపిస్తం
కేసీఆర్‌ బంగారు తెలంగాణ సినిమా చూపిస్తున్నారని కాంగ్రెస్‌ నేత పొంగులేటి సుధాకర్‌ వ్యాఖ్యానించారు. అమరుల కుటుంబాలను కూడా కేసీఆర్‌ మోసం చేశారని ఆరోపించారు. విభజన హావిూలను కేసీఆర్‌ ఏ మాత్రం నెరవేర్చలేదని…మోదీ ప్రేమ ఉంటే చాలు అంటున్నారని విమర్శించారు. బంగారు తెలంగాణ అని మోసం చేసిన టీఆర్‌ఎస్‌కు కాంగ్రెస్‌ రంగస్థలం చూపిస్తుందని హెచ్చరించారు. ఇద్దరు ఎమ్మెల్యేల సభ్యత్వం రద్దు, గిరుజన రైతులకు బేడీలు వేయడం దారుణమని పొంగులేటి మండిపడ్డారు