వడ్లు కొనుగోలు చేసిన రైతులకు వెంటనే డబ్బులు చెల్లించాలి

 తెలంగాణ రైతు సంఘం కొమురవెల్లి మండల కమిటీ అధ్వర్యంలో తహసిల్దార్ గారికి వినతిపత్రం ఇచ్చారు అనంతరం రైతు సంఘం జిల్లా కార్యదర్శి శెట్టిపల్లి సత్తిరెడ్డి మాట్లాడుతూ  యాసంగి వడ్లు అమ్ముకుని నెలలు గడుస్తున్నా రైతుల ఖాతాలలో ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు జమ చేయకపోవడం వలన రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారని వర్షాలు పడడంతో రైతులు విత్తనాలకు ఇరువులకు డబ్బులు లేక అనేక ఇబ్బందులు పడుతున్నారని ప్రైవేటు వడ్డీ వ్యాపారుని ఆశ్రయించడంతో వారు ఇష్టం వచ్చిన వడ్డీతో రైతు కొమురవెల్లి
లకు అప్పులు ఇస్తున్నారని దీనితో రైతులు దివాలా తీసే ప్రమాదం ఉందని వెంటనే రాష్ట్ర ప్రభుత్వం రైతుల దగ్గర కొనుగోలు చేసిన ధాన్యానికి డబ్బులు చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో లో రైతు సంఘం నాయకులు ఆరుట్ల దయానంద్ నీళ బిక్షపతి  బాలకిషన్ పూ స మల్లేశం ఆరుట్ల దయానంద్ శ్రవణాచారి మహేష్ తదితరులు పాల్గొన్నారు