వనపర్తి అభివృద్ధిని కొనసాగిస్తా : వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
వ్యవసాయరంగంలో వనపర్తిని అగ్రస్థానంలో నిలబెడతా
ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారంతో జిల్లా అభివృద్ధి
వనపర్తి (జనం సాక్షి) :
జిల్లా అభివృద్ధిని కొనసాగించడానికి ప్రజలు మరోసారి ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చి ఆశీర్వదించాలి.గత ఎన్నికలలో భారీ మెజారిటీతో గెలిపించి మీరిచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాను.విద్య, వైద్యం, విద్యుత్, వ్యవసాయం, ఉపాధి రంగాలలో వనపర్తిని అభివృద్ధి చేశాను
లక్షలకుపైగా ఎకరాలకు సాగునీరు తీసుకురావడం జరిగింది.దశాబ్దాలుగా వనపర్తి ప్రజల కల రహదారి విస్తరణ పూర్తి కావస్తున్నది.ప్రతి గ్రామం, తండాలకు బీటీ రహదారులు తీసుకువచ్చాను.ప్రతి గ్రామంలో వీధివీధినా సీసీ రహదారులు నిర్మించాం.మిగిలిపోయిన సమస్యలు భవిష్యత్ లో పరిష్కరిస్తాను.ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వనపర్తి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా మరోసారి టికెట్ ప్రకటించిన నేపథ్యంలో స్పందించిన రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి