వరంగల్లో బ్లెండర్స్ ఫ్రైడ్ ఫ్యాషన్ నైట్స్ ‘ప్రైడ్’ వేడుక

ఖైరతాబాద్ : జూన్ 23 (జనం సాక్షి) తెలంగాణ సాంస్కృతిక రాజధాని వరంగల్ లోకి ఒక ప్రత్యేకమైన ప్రయాణ ప్రయోగాత్మక ఆస్తి అయిన బ్లెండర్స్ ప్రైడ్ ఫ్యాషన్ నైట్స్ అడుగుపెట్టింది. ఫ్యాషన్ , శైలి ద్వారా నగర స్ఫూర్తిని ఇది ఆస్వాదిస్తుంది. ప్రైడ్ తో ప్రతిధ్వనిస్తూ నేటి క్రియేటర్లు రేపటి ఐకాన్లుగా మారేందుకు ఇది స్ఫూర్తినిస్తుంది. ఫ్యాషన్, సంస్కృతి, సంగీతాలన్నింటినీ ఒకచోటుకు చేర్చి వరంగల్ నగర అచంచల స్ఫూర్తి, గర్వాన్ని చాటుతూ బ్లెండర్స్ ప్రైడ్ ఫ్యాషన్ నైట్స్ కోసం ‘మేడ్ ఆఫ్ నిజామీ గ్లామ్’ ఎడిషన్ వచ్చింది. వరంగల్ లోని గ్రాండ్ ఆకుతోట కన్వెన్షన్లో ఒక సాయంత్రం సంప్రదాయం, ఆధునికతల చక్కటి సమ్మేళనాన్ని వెలుగులోకి తీసుకురావడానికి వేదికను డిజైనర్ అస్మితా మార్వా ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా తన క్యూరేషన్ గురించి డిజైనర్ అస్మితా మార్వా మాట్లాడుతూ సుస్థిరమైన ఫ్యాషన్ భావనను ప్రాచుర్యంలోకి తీసుకురావడం , సంబరాల వేదిక అయిన బ్లెండర్స్ ప్రైడ్ ఫ్యాషన్ నైట్స్ లో వరంగల్ కు ప్రాతినిధ్యం వహించడం ఎంతో ఆనందాన్నిస్తుందని అన్నారు. బ్లెండర్స్ ప్రైడ్ ఫ్యాషన్ నైట్స్ తో తనకున్న అనుబంధం గురించి నటి అదితి రావు హైదరీ మాట్లాడుతూ నా మూలాలు తెలంగాణలోనే ఉన్నాయన్నారు.