Tuesday, 3 November 2026

వరంగల్‌ ఎంజీఎంలో అగ్ని ప్రమాదం

వరంగల్‌ ఎంజీఎంలో అగ్ని ప్రమాదం జరిగింది. పిల్లల విభాగంలో ఏసీ షార్ట్ సర్క్యూట్‌ అవడంతో మంటలు చెలరేగాయి. వార్డు మొత్తం పొగలు కమ్ముకోవడంతో భయాందోళనతో.. పిల్లలను తల్లిదండ్రులు బయటికి తీసుకువచ్చారు. దీంతో పెను ముప్పు తప్పింది. వెంటనే ఫైర్‌ సిబ్బంది మంటలను అదుపు చేశారు.