– కార్యకర్తలకు అండాదండా
– సీఎం కేసీఆర్
హైదరాబాద్,నవంబర్ 25 (జనంసాక్షి): వరంగల్ ఉప ఎన్నిక విజయం కొత్త చరిత్ర సృష్టించిందని తెలంగాణ సీఎం కేసీఆర్ అన్నారు. వరంగల్ ఎంపీగా ఘన విజయం సాధించిన పసునూరి దయాకర్ బుధవారం క్యాంపుకార్యాలయంలో సిఎం కేసీఆర్‌ను కలిశారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమం, పార్టీకి ఎప్పుడు సంక్షోభం వచ్చినా ఓరుగల్లు ప్రజలు అండగా నిలిచారని అన్నారు. అభివృద్ధి కార్యక్రమాల్లో వరంగల్‌కు ప్రాధాన్యత ఉంటుందని చెప్పారు. వరంగల్‌లో అతిపెద్ద టెక్స్‌టైల్‌పార్కు, ఔటర్ రింగ్ రోడ్డు నిర్మిస్తామని వెల్లడించారు. అభివృద్ధి ఫలాలు ప్రజలకు చేరేలా కార్యకర్తలు చూడాలని కోరారు. త్వరలో కార్యకర్తలకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పారు. వరంగల్ లోక్‌సభకు జరిగిన ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థి పసునూరి దయాకర్ భారీ మెజారిటీతో గెలుపొందిన విషయం తెలిసిందే. ఈమేరకు ఇవాళ ఆయన తన కుటుంబ సభ్యులతో కలిసి సీఎం క్యాంపు కార్యాలయానికి వచ్చి తనకు సీటు ఇచ్చి గెలిపించినందుకు సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా కష్టపడి ఎన్నికల ప్రచారం చేసి గెలిచావని పసునూరిని సీఎం అభినందించారు. నియోజకవర్గం అభివృద్ధి కోసం, తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను కాపాడటం కోసం పార్లమెంట్‌లో పార్టీ సభ్యులతో కలిసి పనిచేయాలని సీఎం పసునూరికి సూచించారు. తెలంగాణ ప్రజలకు టీఆర్‌ఎస్ పార్టీ శ్రీరామ రక్ష కావాలని సీఎం ఆవాభావం వ్యక్తం చేశారు. కార్యకర్తలు, ప్రజా ప్రతినిధులు రక్షణ కవచంలా నిలవాలని కోరారు. తెలంగాణ ప్రజలు టీఆర్‌ఎస్‌కు ఎంతో గౌరవం ఇచ్చారని పేర్కొన్నారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టేలా ప్రజా ప్రతినిధులు, నాయకులు పనిచేయాలని విజ్ఞప్తి చేశారు. వరంగల్ విజయం కొత్త చరిత్ర సృష్టించిందని వెల్లడించారు. నాయకులు, కార్యకర్తలు ప్రజలతో అత్యంత వినయంగా ఉండాలని విజయ గర్వం తలకెక్కదన్నరు. సూచించారు. పార్టీకి, ఉద్యమానికి ఎప్పుడు సంక్షోభం వచ్చినా వరంగల్ ప్రజలు అండగా నిలిచిన విషయాన్ని సీఎం గుర్తు చేశారు. ఈసారి ప్రభుత్వాన్ని దీవించి ఆత్మవిశ్వాసం పెంచారని శ్లాఘించారు. అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా వరంగల్‌కు తగిన ప్రాధాన్యత ఉంటుందని తెలిపారు. ప్రభుత్వం చేపట్టే అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు చేరేలా కార్యకర్తలు చూడాలని విజ్ఞప్తి చేశారు. త్వరలో కార్యకర్తలు, ప్రజా ప్రతినిధులకు శిక్షణ ఇస్తామని తెలిపారు. పార్టీని నమ్మిన ప్రతీ ఒక్కరికీ తప్పక అవకాశం వస్తుందని హావిూ ఇచ్చారు.





