Wednesday, 4 November 2026

వరంగల్ జిల్లాల్లో స్వైన్ ప్లూ కలకలం.

  • 0
    Share

వరంగల్ : నర్సంపేటపట్టణంలోని ఓ మహిళకు స్వైన్‌ఫ్లూ సోకిన విషయం శుక్రవారం వెలుగులోకి వచ్చింది. స్థానిక ఎస్‌పీహెచ్‌వో డాక్టర్‌ వెంకటరమణ తెలిపిన ప్రకారం… పట్టణంలో నె హ్రూనగర్‌కు చెందిన మహిళ(41) అస్వస్థతో వారంరోజుల క్రితం హైదరాబాద్‌ గ్లోబల్‌ ఆస్పత్రి లో చేరగా అక్కడి వైద్యులు పరీక్షలు నిర్వహించి స్వైన్‌ఫ్లూగా నిర్థారించారు. ఆస్పత్రి వైద్యులు అందించిన సచాచారంతో జిల్లా వైద్యాధికారుల ఆదేశాల మేరకు నెహ్రూనగర్‌లో ఎస్‌పీహెచ్‌వో వెంకటరమణ, పీహెచ్‌వో సంపూర్ణ, వైద్య సిబ్బంది జోగయ్య, మలేరియా సబ్‌ యూనిట్‌ ఆఫీసర్‌ మహేందర్‌లు శుక్రవారం సందర్శించి కాలనీలో వైద్య పరీక్షలు నిర్వహించగా అక్కడ స్వైన్‌ఫ్లూ ఎవరికీ సోకలేదని నిర్థారించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *