వరద బాధితులందరికీ సాయం అందిస్తాం – కేటీఆర్
హైదరాబాద్,అక్టోబరు 31(జనంసాక్షి):అర్హులైన ప్రతిఒక్క వరద ప్రభావిత కుటుంబానికి ఆర్థిక సాయం అందిస్తామని.. ఎవరూ ఆందోళన పడాల్సిన అవసరం లేదని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ వరద బాధితులకు హావిూ ఇచ్చారు. పలు వరద ప్రభావిత ప్రాంతాల నుంచి తమకు ఆర్థిక సాయం అందలేదని కొంతమంది చేసిన విజ్ఞప్తులు తన దృష్టికి వచ్చాయన్నారు. ఇప్పటికే జీహెచ్ఎంసీ అధికారుల సాయంతో వరద ప్రభావిత కుటుంబాలను గుర్తించి, వారందరికీ ఆర్థిక సాయం అందించామని చెప్పారు. ప్రతి ఒక్క బాధిత కుటుంబానికి సాయం అందించాలన్నదే తమ ప్రభుత్వ ప్రయత్నమన్నారు. ఆర్థిక సాయాన్ని అందించే కార్యక్రమాన్ని అవసరమైతే మరికొద్ది రోజులు పొడిగించి, అర్హులైన వారికి సాయం అందేలా చూస్తామని స్పష్టం చేశారు. వరదల్లో నష్టపోయిన ప్రతి ఒక్కరికి సాయం అందించాలని సీఎం కేసీఆర్ ఆదేశించినట్లు ఈ సందర్భంగా మంత్రి గుర్తు చేశారు. ఈ మేరకు జీహెచ్ఎంసీ అధికారులు, హైదరాబాద్ జిల్లా యంత్రాంగంతో సవిూక్ష నిర్వహించి నిర్ణయం తీసుకుంటామని మంత్రి కేటీఆర్ వివరించారు.