శ్రీకాకుళం: భారీ వర్షాల కారణంగా పలు ప్రాంతాలు నీట మునగడంతో శ్రీకాకుళం జిల్లావ్యాప్తంగా విద్యాసంస్థలకు నేడు సెలవును ప్రకటించారు. మరోవైపు పశ్చిమగోదావరి జిల్లాలోని ఏలూరు, దెందులూరు నియోజకవర్గాల్లో వరద ఉద్థృతి తగ్గకపోవడంతో అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలకు సెలవును ఇస్తున్నాట్లు అధికారులు తెలియజేశారు.




