– ముమ్మరంగా కొనసాగుతున్న సహాయక చర్యలు
చెన్నై,డిసెంబర్ 7 (జనంసాక్షి): దాదాపు నెల రోజులుగా కురుస్తున్న వర్షాలతో అల్లాడుతున్న చెన్నైని ఇప్పుడు చెత్త భయం వెంటాడుతోంది. అసలే ఆహారం, నీరు సరిగా అందక అల్లాడుతున్న నగరవాసులకు ఈ దుర్గంధ సమస్య తీవ్రంగా ఉంది.వరద నీరు తొలగుతుండగా మిగిలిన బురద, ఎక్కడికక్కడ గుట్టలుగా పేరుకుపోయిన వ్యర్థాలు కార్పొరేషన్‌కు, ప్రజలకు పెద్ద తలనొప్పిగా మారాయి. చెత్తను ఎప్పటికప్పుడు తొలగించాల్సిన నగర పాలక సంస్థ వాహనాలు పూర్తి స్థాయిలో అందుబాటులో లేకపోవడం.. కావాల్సినంత మంది సిబ్బంది అందుబాటులో లేకపోవడంతో సమస్య మరింత జటిలమవుతోంది. ముఖ్యంగా వాహనాలు నాలుగైదు రోజుల పాటు నీటిలో మునిగి ఉండటంతో పని చేయడానికి మొరాయిస్తున్నాయి. రాష్ట్రంలో వర్షం సమస్యలు లేని నగర పాలక, పురపాలక సంస్థల నుంచి సిబ్బందిని తీసుకువచ్చి పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టినా ఫలితం కనిపించడం లేదు. చెన్నై పరిస్థితికి స్పందించిన ఆహార పదార్థలు, నీళ్లు, ఆరోగ్య సహాయం అందించడానికి ముందుకొచ్చిన స్వచ్ఛంద సంస్థలను సమన్వయ పరుస్తూ సహాయార్థులకు చేరువ చేసేలా వ్యవహరించడంలో అధికార యంత్రాంగం వెనకబడింది. సంస్థలు, దాతలు వివిధ వాహనాల్లో సహాయ సామగ్రి తీసుకొచ్చి తమకు తెలిసిన ప్రాంతాలకు తరలిస్తున్నారు తప్ప, నిర్దిష్టంగా సహాయం అందే ఏర్పాట్లు లేవు. . దీనితోపాటు త్రివిధ దళాలతోనూ, ఎన్డీఆంఎఫ్ బృందాలతో సమన్వయంగా వ్యవహరించడంలోనూ ప్రభుత్వ యంత్రాంగం చొరవ కనిపించడం లేదు. నగరవ్యాప్తంగా చాలా వరకూ విద్యుత్తును పునరుద్ధరించారు. ఇంకా కొన్ని ప్రాంతాలు అంధకారంలోనే ఉండిపోయాయి. దక్షిణ చెన్నైలోనే ఈ పరిస్థితి ఎక్కువగా ఉంది. కొన్ని చోట్ల విద్యుత్తు లేదు. అటువంటి చోట్ల చీకటిపడితే చాలు జనాన్ని భయం వెంటాడుతోంది. ఇళ్లలోకి పాములు, ఎలుకలు, పురుగులు రావడంతో కంగారు పడుతున్నారు. చుట్టూ చిమ్మచీకట్లు, మరోవైపు విష పురుగులతో రాత్రంతా భయం భయంగా
గడుపుతున్నారు. దోమలు విపరీతంగా దాడి చేస్తున్నాయి. మరోవైపు చాలాచోట్ల వైరల్ జ్వరాలు విజృంభిస్తున్నాయి. ఎక్కువ శాతం ఇళ్లలో ఒకరో ఇద్దరో సుస్తీతో కనిపించడం గమనార్హం. చెత్త కూడా సకాలంలో తొలగించకపోవడంతో వ్యాధులు వచ్చే అవకాశం ఉన్నట్లు ఆందోళన చెందుతున్నారు. చనిపోయిన వారికి అంతిమ సంస్కారాలు చేయడానికి వీల్లేక బంధువులు అవస్థ పడుతున్నారు.
చెన్నై విమానాశ్రయాన్ని సందర్శించిన అశోచీగజపతిరాజు
కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి అశోచీగజపతిరాజు చెన్నై విమానాశ్రయాన్ని పరిశీలించారు. ఇటీవల సంభవించిన వరదల కారణంగా విమానాశ్రయం నీట మునిగిన విషయం తెలిసిందే. విమానాశ్రయాన్ని సందర్శించిన అనంతరం అధికారులతో ఆయన సవిూక్ష నిర్వహించారు. విమానాశ్రయంలో విమాన రాకపోకల, వరదల కారణంగా విమానాశ్రయానికి కలిగిన నష్టాన్ని అడిగి తెలుసుకున్నారు. మరికాసేపట్లో ఆయన తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితతో బద్కటీ కానున్నారు.
వాతావరణశాఖ హెచరికతో మళ్లీ భయాందోళనలు
గత నెలరోజులుగా భారీ వర్షాలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న తమిళనాడు ముఖ్యంగా చెన్నై ప్రజానీకాన్ని వాతావరణ శాఖ సూచన మరోసారి టెన్షన్ పెట్టింది. బంగాఖాతంలో శ్రీలంక, ఉత్తర తమిళనాడు తీరంలో కేంద్రీకృతమై ఉన్న అల్పపీడన ద్రోణి ప్రభావంతో రాగల 24 గంటల పాటూ భారీ వర్షాలు కొనసాగుతాయని చెన్నై వాతావరణశాఖ అధికారులు ప్రకటించారు. ఈ అల్పపీడనం వల్ల తమిళనాడులోని సముద్రతీర జిల్లాల్లోనూ, పుదుచ్చేరిలోనూ ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు కురుస్తాయని ప్రకటించడంతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. దీంతో వారిలో వర్షభయం వీడడం లేదు. గత 20 రోజులపాటూ కురిసిన వర్షాలకు తోడు చెంబరబాక్కం చెరువు నుండి ప్రవహించిన వరదనీటితో జనవాసాలన్నీ నీట మునిగిపోగా, చెంబరబాక్కం చెరువు తెగబోతోందనే వదంతులు బయలుదేరాయి. నడుము లోతు నీళ్ల నుండి బైటపడకముందే పీక ల్లోతు నీళ్లలోకి వెళ్లిపోతున్నామని ప్రజలు బెంబేలెత్తిపోయారు. ఈ సమాచారం ప్రభుత్వం చెవినకూడా పడటంతో వదంతులు నమ్మవద్దని, చెంబరబాక్కం చెరువు పటిష్టంగా ఉందంటూ హడావిడి ప్రకటన చేశారు. వరదతో అతలాకుతలమైన చెన్నైలో ఇప్పుడిప్పుడే సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. రెండు రోజులుగా ఇక్కడ భారీ వర్షాలు లేవు. ఎండ, తేలికపాటి వాన దోబూచులాడుతున్నాయి. ఆదివారం మోస్తరు వర్షం కురిసింది. భారీ వర్షాలు లేకపోవడంతో వరద నీరు తగ్గుముఖం పట్టింది. సోమవారం కూడా తేలికపాటి వర్షాలు కురిసే సూచనలున్నాయని ప్రాంతీయ వాతావరణ కేంద్రం వెల్లడించింది. దీంతో ప్రభుత్వం చెన్నైలోని పాఠశాలలకు సెలవు ప్రకటించింది. మరోవైపు నగరంలో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగు తున్నాయి. పునరావాస కేంద్రాంల్లో బాధితులకు ఆహారం, నీరు, మందులు, వైద్య సదుపాయాలు అందజేస్తున్నారు. ఈ ప్రాంతాల నుంచి వచ్చి పునరావాస కేంద్రాల్లో తలదాచుకుంటున్న వారు మళ్లీ తమ ఇళ్లకు వెళ్తున్నారు. ఇప్పుడు వీధుల్లో నీరు లేకున్నా బురద భయపెడుతోంది. స్థానికులకు బురదమయమైన ఇళ్లను శుభ్రం చేసుకోవడం పెద్ద సమస్యగా మారింది. నీరు నిలిచి ఉన్న ఒకటి రెండు ప్రాంతాలు మినహా మిగిలినచోట్ల విద్యుత్తు సరఫరాను పూర్తిగా పునరుద్ధరించారు. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ నగరంలోని అన్ని పెట్రోలు బంకులను తెరిపించింది. దాంతో ఎక్కడా పెట్రోలు, డీజిల్ కొరత ఏర్పడలేదు. ఆవిన్ పాలు సరిపడా దొరుకుతున్నాయి. నిత్యావసర వస్తువుల సరఫరా కూడా మెరుగవుతోంది. చెన్నై నుంచి విమాన, రైలు సర్వీసులను పునరుద్దరిస్తున్నారు. అన్ని రైలు సర్వీసులను యథావిధిగా పునరుద్ధరిస్తున్నట్లు దక్షిణ రైల్వే జనరల్ మేనేజం తెలిపారు. వరదలకు చెన్నైలోని విద్యార్థుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. పాఠ్యపుస్తకాలన్నీ ధ్వంసమయ్యాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రమంతటా అర్ధసంవత్సర పరీక్షలు రద్దు చేసి నేరుగా వార్షిక పరీక్షలు నిర్వహించాలనే దిగా ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. భారీ వర్షాలు, వరదలతో చెన్నై ఐటీ రంగానికి 60 మిలియన్ డాలర్లు అంటే దాఆపు రూ. 400 కోట్ల నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. ఇందులో చిన్న ఐటీ కంపెనీలకు వాటిల్లిన నష్టం 10 మిలియన్ డాలర్ల వరకు ఉండగా, పెద్ద కంపెనీలు 50 మిలి యన్ డాలర్ల వరకు నష్టపోయిన్నట్లు అంచనా వేస్తున్నారు. టీసీఎస్, కాగ్ని జంట్, ఇన్ఫోసిస్ లాంటి కొన్ని సంస్థలు తమ ఉద్యోగులను బెంగళూరుకు తరలించి ప్రాజెక్టులు పూర్తి చేసుకుంటున్నాయి. ఐటీ రంగంతో పాటు ఆటోమొబైల్ రంగంపై కూడా ఈ ప్రభావం తీవ్రంగానే ఉన్నట్లు తెలుస్తోంది. ఆటోమోబైల్ రంగానికి సుమారు 15వేల కోట్ల రూపాయల నష్టం కలుగుతున్నట్లు అంచ నావేస్తున్నారు. చిన్న, మధ్య తరహా, సాంకేతిక, టెచ్సీటైల్ పరిశ్రమలు తీవ్రంగా ప్రభావితం అయినట్లు అసోచామ్ వెల్లడించింది. వర్షాలతో మూతపడిన పలు కంపెనీలు ఇప్పటికీ తెరుచుకోలేదు.





