Friday, 6 November 2026

వరవరరావు అరెస్ట్‌కు రంగం సిద్దం?

హైదరాబాద్‌,నవంబర్‌17(జ‌నంసాక్షి): ప్రధాని మోదీ హత్యకు కుట్ర పన్నిన కేసులో పుణె పోలీసులు విప్లవ రచయిత వరవరరావును అరెస్టు చేసే అవకాశాలున్నాయి. బీమాకోరేగావ్‌ కేసులో హౌజ్‌ అరెస్టు అయిన వరవరరావు.. ప్రస్తుతం గాంధీనగర్‌లోని నివాసంలో ఉంటున్నారు. అయితే పుణె పోలీసులు అతన్ని కస్టడీలోకి తీసుకోనున్నాయి. ఏసీపీ ర్యాంక్‌ ఆఫీసర్‌ ఆధ్వర్యంలోని పుణె పోలీసులు ప్రస్తుతం హైదరాబాద్‌కు వచ్చారు. శుక్రవారం రాత్రే వచ్చినా.. ఆలస్యం కావడం వల్ల వరవరరావును కస్టడీలోకి తీసుకోలేదన్నారు. పుణెలోని ఓ స్థానిక కోర్టులో వరవరరావును ప్రవేశపెట్టనున్నారు. బీమాకోరేగావ్‌లో

అల్లర్లకు ప్రేరేపించిన కేసులో దేశవ్యాప్తంగా అయిదుగురు సామాజిక కార్యకర్తలను మహారాష్ట్ర పోలీసులు హౌజ్‌ అరెస్టు చేసిన విషయం తెలిసిందే.