Monday, 2 November 2026

వరుస సెలవుల్లేవు

– బ్యాంకుల బంద్‌ పై క్లారిటీ
హైదరాబాద్‌, ఆగస్టు31(జ‌నం సాక్షి) : సెప్టెంబర్‌ మొదటివారంలో ఆరురోజుల పాటు బ్యాంకులు బంద్‌ అవుతాయంటూ వైరల్‌ అవుతున్న న్యూస్‌ లో నిజం లేదని బ్యాంక్‌ ఉద్యోగుల అసోసియేషన్‌ క్లారిటీ ఇచ్చింది. వాట్సాప్‌.. ఇతర సోషల్‌ గ్రూపుల్లో విపరీతంగా షేర్‌ అవుతున్న వార్తలు నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు. మూడోతేదీ కృష్ణాష్టమి బ్యాంకులకు ఆప్షనల్‌ హాలీడే అని చెప్పారు. దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో మాత్రమే సెలవు ప్రకటించారని, ఢిల్లీ, ముంబై సహా పలు నగరాల్లో బ్యాంకులు తెరిచే ఉంటాయన్నారు. తెలంగాణ, ఆంధప్రదేశ్‌ రాష్ట్రాల్లో జన్మాష్టమి సందర్భంగా చాలా బ్యాంకులు సెలవు ప్రకటించాయి.సెప్టెంబర్‌ 4, 5 తేదీల్లో ఆర్బీఐ ఉద్యోగులు మాత్రమే సమ్మెకు పిలుపునిచ్చారని బ్యాంక్‌ అసోసియేషన్‌ తెలిపింది. ఈ సమ్మె బ్యాంకింగ్‌ వ్యవస్థపై పెద్దగా ప్రభావం చూపదని చెప్పింది. ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులన్నీ 4, 5 తేదీల్లో యథావిధిగా పనిచేస్తాయని క్లారిటీ ఇచ్చింది. 6, 7 తేదీల్లో వర్కింగ్‌ డేస్‌ కాబట్టి ఇబ్బంది ఉండదన్నారు బ్యాంకింగ్‌ ప్రతినిధులు. ఒకట్రెండు రోజులే సెలవులు ఉంటాయి కాబట్టి ఏటీఎంలలో నగదు కొరత సమస్య రాదని చెప్పారు. సెప్టెంబర్‌2 ఆదివారం సెలవు, సెప్టెంబర్‌ 3 జన్మాష్టమి సెలవు, 4, 5 తేదీల్లో బ్యాంక్‌ ఉద్యోగులు సమ్మె కారణంగా బ్యాంకులు పనిచేయవు, 8, 9 తేదీలు సెకండ్‌ శాటర్‌ డే, ఆదివారం ఇలా ఆరురోజులు బ్యాంకులు పనిచేయవని సోషల్‌ విూడియాలో ఓ పోస్ట్‌ వైరల్‌ అవుతోంది. దీనిని నమ్మవద్దని బ్యాంకింగ్‌ ఎంప్లాయిస్‌ అసోసియేషన్‌ క్లారిటీ ఇచ్చింది.

“>