ఏలూరు,నవంబర్10(జనంసాక్షి): మెట్ట ప్రాంతాల్లో సేద్యపు నీటికుంటలు తవ్వుకున్న రైతులకే రాయితీపై తుంపర సేద్యం పరికరాలను అందజేస్తామని వ్యవసాయాధికారులు అన్నారు. రైతులకు అవసరమైన ఎరువులు, పురుగుమందులను ఈ-పాస్ యంత్రాల ద్వారా మాత్రమే విక్రయించేలా అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. మూడో పంటకు అవసరమైనమినుము, పెసర విత్తనాలను సిద్ధంచేసి గ్రామాలవారీగా భద్రపరచాలన్నారు. మెట్ట ప్రాంతంలో బోర్ల ద్వారా వ్యవసాయం చేస్తున్నందున మూడో పంటకు నీటి సమస్య ఉండబోదని చెప్పారు. ఇంటింటా కూరగాయలను పండించుకోవాలనే ఉద్దేశంతో కూరగాయల విత్తనాలను సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు. కాలుష్యాన్ని కలిగించేలా చేపల చెరువులను నిర్వహిస్తే సంబంధిత
యాజమానులపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఇదివరకే అధికారులను ఆదేశించారు. చేపల చెరువుల్లో కోళ్ల వ్యర్థాలను కలిపే విష సంస్కృతిని నిరోధించాలన్నారు.




