Monday, 2 November 2026

వర్షాలు పడాలని కప్పతల్లి ఆటలు

నల్లబెల్లి జూన్ 10 (జనం సాక్షి):
జూన్ మొదటి వారంలో  పడాల్సిన వర్షాలు పడకపోవడంతో “వర్షాలు కురవాలి వానదేవుడో పంటలు బాగా పండాలి వానదేవుడో” అంటూ  పాటలు పాడుతూ కప్పతల్లి ఆటలు ఆడిన సంఘటన మండలంలోని నారక్కపేట గ్రామంలో చోటు చేసుకుంది. చిన్నారులు అంతా కలిసి కప్పను రోకలి కట్టి వాడ వాడ తిరుగుతూ వర్షాలు కురవాలని కప్ప తల్లిపై నీళ్ళు పోస్తూ వరుణ దేవుణ్ణి వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో చరణ్ తేజ, విజయ్,నాగ చైతన్య,భాను ప్రకాష్,అజయ్,రణధీర్,ధనుష్, రామ్ చరణ్,తేజశ్రీ పాల్గొన్నారు.
Attachments area