Wednesday, 4 November 2026

వర్షాల కోసం రైతన్నల ఎదురుచూపు

హైదరాబాద్‌,జూన్‌25(జ‌నం సాక్షి ): నైరుతి రుతుపవనాలు చురుకుగా కదులుతున్నాయని చెబుతున్నా రాష్ట్రంలో పలుచోట్ల ఓ మోస్తరును మించి వర్షాలు కురియలేదు. దీంతో వ్యవసాయపనులు ఎక్కడిక్కడే నిలిచిపోయాయి. రాష్ట్రంలోని పలుచోట్ల తేలికపాటి జల్లుల నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. ఇక నదుల్లో నీరు రావడం లేదు. ఎగువప్రాంతాల్లో వర్షపాతం బాగా నమోదయితేనే కషృ/-ణా,గోదావరిల్లోకి నీరు వచ్చి చేరుతుంది. ఇన్‌ఫ్లో కొనసాగితే నీటిమట్టం పెరిగే అవకాశంఉంది. తొలుత వర్షం ఆరంభం కాగానే రైతులు సంతోష పడ్డారు. గత వారం రోజులుగా నేలలో విత్తనం విత్తి ఆకాశానికి ఎదురు చూపులు చూస్తున్న రైతన్నలు ఆందోళనతతో ఉన్నారు.