Monday, 2 November 2026

వల్లభాయ్‌ పటేల్‌ వేషధారణలో ఎంపీ శివప్రసాద్‌ నిరసన

– పటేల్‌ పాలనకు వ్యతిరేఖంగా మోడీ పాలన
– మోడీ ప్రభుత్వానికి ప్రజలు గుణపాఠం చెప్పాలి
– తెదేపా ఎంపీ శివప్రసాద్‌
చిత్తూరు, అక్టోబర్‌31(జ‌నంసాక్షి) : చిత్తూరు టీడీపీ ఎంపీ, టాలీవుడ్‌ నటుడు శివప్రసాద్‌ వల్లభాయ్‌ పటేల్‌ వేషధారణలో కేంద్ర ప్రభుత్వం ఏపీ పట్ల వ్యవహరిస్తున్న తీరుకు నిరసన తెలిపారు. సమైక్యాంధ్ర ఉద్యమం నుంచి ప్రత్యేక ¬దా పోరు వరకు చిత్ర విచిత్రమైన వేషధారణలో కనిపిస్తూ నిరసనతో శివప్రసాద్‌ రోడ్డెక్కుతున్నారు. పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాల్లోలో తన వేషాలతో అందర్ని ఆకర్షించిన శివ ప్రసాద్‌.. చాలా రోజుల తర్వాత మరోసారి కొత్త వేషంలో దర్శనమిచ్చారు. ఈసారి వెరైటీగా ఉక్కు మనిషి సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ వేషంలో  కనిపించారు. బుధవారం ఉదయం తిరుపతిలోని మున్సిపల్‌ కార్యాలయం ఎదుట సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ వేషంలో నిరసన తెలిపారు. ప్రధాని మోదీ స్టాట్యు ఆఫ్‌ యూనిటీని (పటేల్‌ విగ్రహాన్ని) ఆవిష్కరించడంపై తన నిరసనను తెలియజేశారు. పటేల్‌ గుజరాత్‌లో లేరని.. అక్కడి నుండి పారిపోయి తిరుపతి వచ్చారంటూ శివప్రసాద్‌ వినూత్నంగా నిరసన తెలిపారు. మోదీ ప్రభుత్వం వల్లభాయ్‌ పటేల్‌ ఆలోచనలకు వ్యతిరేకంగా పనిచేస్తోందని శివప్రసాద్‌ మండిపడ్డారు. దేశం మొత్తాన్ని ఏకం చేయాలని.. పటేల్‌ అనుకుంటే మోడీ విడదీయాలనుకుంటున్నారన్నారు. రాష్ట్రాలను విడగొట్టడమే లక్ష్యంగా పెట్టుకున్న బీజేపీకి విగ్రహం పెట్టే అర్హత లేదని విమర్శించారు. ప్రధాని మోదీ పటేల్‌ అభిమాని అంటూ చెప్పుకొని మార్కులు కోట్టేయాలని ప్లాన్‌ చేస్తున్నారన్నారు. ఏపీ అంటే ప్రధాని మోదీకి గిట్టదని.. తిరుపతిలో వెంకన్న సాక్షిగా ఇచ్చిన హావిూలను విస్మరించారని మండిపడ్డారు. ఇలాంటి మోడీ ప్రభుత్వానికి రానున్న ఎన్నికల్లో గుణపాఠం చెప్పాలని శివప్రసాద్‌ పిలుపునిచ్చారు.