– జగన్‌ను హత్య చేసేందుకు కుట్ర జరుగుతుంది
– ప్రభుత్వ పెద్దల సహకారంతోనే ఎయిర్‌పోర్టులోకి కత్తులు వెళ్లాయి
– విలేకరుల సమావేశంలో మాజీ ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి
అనంతపురం, అక్టోబర్31(జనంసాక్షి) : శ్రీనివాసరావును చంపి కేస్ క్లోజ్ చేసేందుకు చంద్రబాబు కుట్ర పన్నుతున్నారని అనంతపురం మాజీ ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి ఆరోపించారు. బుధవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని చంపేందుకు భారీ కుట్ర జరిగిందన్నారు. ప్రభుత్వ పెద్దల సహకారంతోనే విశాఖ ఎయిర్‌పోర్ట్‌లోకి కత్తులు వెళ్లాయని ఆరోపించారు. శ్రీనివాసరావును చంపి కేస్ క్లోజ్ చేసేందుకు చంద్రబాబు కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. పోలీసు కస్టడిలోని నిందితుడికే రక్షణ లేకపోతే ఎలా అని ఆయన ప్రశ్నించారు. 13ఏళ్లు
ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు ఆపరేషన్ గరుడ నిజమనడం సిగ్గు చేటని వెంకట్రామి రెడ్డి వ్యాఖ్యానించారు. ఇంత జరుగుతుంటే నటుడు శివాజీని ఎందుకు అరెస్ట్ చేయలేదని ప్రశ్నించారు. ప్రస్తుతం ఏపీలో ఆపరేషన్ చంద్రబాబు కొనసాగుతుందంటూ విమర్శించారు. సీఎం, డీజీపీ డైరెక్షన్‌లోనే నింధితుడు మాట్లాడుతన్నారని ఆరోపించారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే థర్డ్ పార్టీ దర్యాప్తుకు అంగీకరిస్తూ లేఖ రాయలని.. కేసును సుప్రీం కోర్టు జడ్జీతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఏపీ ప్రజలంతా చంద్రబాబు కుట్రలను గమనించాలని, వచ్చే ఎన్నికల్లో స్వలాభాలకోసం పనిచేసుకొనే ప్రభుత్వాన్ని సాగనంపాలని పిలుపునిచ్చారు.
శ్రీనివాసరావ్‌ని చంపి.. కేసు క్లోజ్ చేసేందుకు ప్రభుత్వం కుట్ర




