*వసుధ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పిల్లలకు నోట్ పుస్తకాల పంపిణీ.

*జైనథ్ జనంసాక్షి : మండలంలోని మేడిగూడ రోడ్ ప్రాథమిక పాఠశాలలో వసుధ ఫౌండేషన్ సహకారంతో ఉచితంగా రెండు వందల నోట్ పుస్తకాలను ఉపాధ్యాయులు విద్యార్థులకు అందజేశారు*
*ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు కొనిగెల నారాయణ మాట్లాడుతూ వసుధ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గత ఏడు సంవత్సరాల నుండి మా పాఠశాల విద్యార్థులకు నోట్ పుస్తకాలను అందజేస్తున్నారు అని అన్నారు. ప్రభుత్వ పాఠశాలలు బలోపేతం చేయడానికి వారు చేస్తున్నా సేవా నిరతి అభినందనీయమన్నారు. ప్రభుత్వ పాఠశాలలలోనే చదివే విద్యార్థులు పేదా విద్యార్థులే ఎక్కువ చదువుతున్నారు. ప్రతి సంవత్సరం ఇలా పంపిణీ చేయడం వల్ల వారి తల్లిదండ్రులకు ఆర్థిక ఊరట లభిస్తుందని అన్నారు. వసుధ ఫౌండేషన్ చైర్మన్ మంతెన వెంకట రామరాజుకు విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామస్తులు, ఉపాధ్యాయులు కృతజ్ఞతలు తెలియజేశారు అని అన్నారు*
*నోట్ పుస్తకాల పంపిణీలో గ్రామ సర్పంచ్ సీమా శ్యాం, పాఠశాల యాజమాన్య కమిటీ చైర్మన్ పోలవేణి అడేల్లు, ఉపాధ్యాయులు బండోల్ల భవానీఆనంద్, సావయి ప్రకాష్, పెంటపర్తి ఊశన్న, కన్నల భూమయ్య, గ్రామ పెద్దలు చిట్యాల నర్సింహులు, లక్ష్మీ బాయి తదితరులు పాల్గొన్నారు.